SIM Card: మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ‘సిమ్ కార్డు’ (SIM Card) పరిచితమైనదే. పరిమాణంలో ఎంతో చిన్నగా ఉండే ఈ చిప్.. మనల్ని ప్రపంచంతో అనుసంధానించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రతీ సిమ్ కార్డుకు నాలుగు మూలల్లో ఒక మూల మాత్రం కట్ అయి (bevel edge) ఉంటుంది. ఇది కేవలం ఒక డిజైన్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం, వినియోగదారుల సౌకర్యం దాగి ఉంది.సిమ్ కార్డు కట్, సిమ్ కార్డు రహస్యం, మొబైల్ టెక్నాలజీ, సిమ్ ఇన్సర్ట్, టెలికాం వింతలు, సిమ్ కార్నర్ కట్ కారణం, టెక్ వార్తలు, మొబైల్ టిప్స్
మొబైల్ సాంకేతికత ప్రారంభ రోజుల్లో ప్రవేశపెట్టిన సిమ్ కార్డులు నాలుగు వైపులా సమానమైన కొలతలతో, చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. అయితే దీనివల్ల మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సిమ్ కార్డును ఫోన్లోని సిమ్ స్లాట్‌లో ఏ దిశలో అమర్చాలో (Insert) తెలియక చాలామంది గందరగోళానికి గురయ్యేవారు. పొరపాటున తిరగబేసి లేదా తప్పుడు కోణంలో పెట్టడం వల్ల సిమ్ కార్డుపై ఉండే గోల్డ్ మైక్రోచిప్ దెబ్బతినడమే కాకుండా, ఫోన్ లోపల ఉండే పిన్నులు (SIM jacket pins) కూడా విరిగిపోయేవి. దీనివల్ల సిమ్ కార్డు పనిచేయకపోవడం, ఫోన్ నెట్‌వర్క్‌ను గుర్తించకపోవడం వంటి సమస్యలు తలెత్తేవి.

ఈ నిరంతర ఫిర్యాదులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి టెలికాం సంస్థలు, డిజైనర్లు ఒక వినూత్న ఆలోచన చేశారు. అదే సిమ్ కార్డు ఒక మూలను కట్ చేయడం. సిమ్ కార్డుతో పాటు, ఫోన్లోని సిమ్ ట్రే లేదా స్లాట్‌ను కూడా అదే ఆకారంలో (కట్ చేసిన మూలకు సరిపోయేలా) డిజైన్ చేశారు.
ఈ చిన్న మార్పు వల్ల వినియోగదారులకు సిమ్‌ను ఏ దిశలో పెడితే సరిగ్గా అమరుతుందో సులభంగా అర్థమైపోతుంది. కట్ చేసిన భాగం స్లాట్ డిజైన్‌కు సరిగ్గా మ్యాచ్ అయితేనే సిమ్ లోపలికి వెళ్తుంది. దీనివల్ల తప్పుగా పెట్టే అవకాశమే ఉండదు (Foolproof design). ఫలితంగా సిమ్ చిప్ డ్యామేజ్ అవ్వడం పూర్తిగా తగ్గింది. కాలానుగుణంగా సిమ్ కార్డులు సాధారణ సైజ్ నుంచి మైక్రో, నానో సైజులకు మారినప్పటికీ, ఈ ‘కట్ కార్నర్’ డిజైన్‌ను మాత్రం ఇప్పటికీ ప్రామాణికంగా కొసాగిస్తున్నారు.
Also Read: Corona Alert: మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. మాస్కులు మస్ట్!
