Viral: అత్యాచార నిందితుడికి గ్రాండ్ వెల్ కమ్

Video: Released On Bail, Rape-Accused Garlanded, Carried On Shoulders In UP

Video: Released On Bail, Rape-Accused Garlanded, Carried On Shoulders In UP

Viral: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్యాచారం కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి విడుదలైన వెంటనే ఘన స్వాగతం పలకడం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది.

సుశీల్ ప్రజాపతి అనే వ్యక్తి అత్యాచారం కేసులో అరెస్టై తొమ్మిది నెలల పాటు జైలులో ఉన్నాడు. ఇటీవల అతడు బెయిల్‌పై విడుదల కావడంతో, మే 17న అతని అనుచరులు జైలు గేటు వద్ద పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అతడికి పూలదండలు వేసి, కాళ్లకు నమస్కరించి, భుజాలపై ఎక్కించుకుని ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హీరోలా గౌరవించడం సమాజానికి తప్పు సందేశం ఇస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, సుశీల్ ప్రజాపతి గతంలో ‘హిందూ యువ వాహిని’ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఓ న్యాయ విద్యార్థినికి లాయర్‌ను పరిచయం చేస్తానని నమ్మబలికి, ఆమెను ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన అతడికి ఈ స్థాయిలో స్వాగతం పలకడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Viral: 500కి 499 మార్కులు.. అయినా తల్లికి సంతృప్తి లేదు

Viral: అత్యాచార నిందితుడికి గ్రాండ్ వెల్ కమ్