Viral: 500కి 499 మార్కులు.. అయినా తల్లికి సంతృప్తి

Mother of ICSE student who scored 499/500 expresses regret: 'If only he had studied harder...'

Mother of ICSE student who scored 499/500 expresses regret: 'If only he had studied harder...'

Viral: స్టేట్ ర్యాంక్ వచ్చినా కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది జాతీయ స్థాయిలో అద్భుతమైన మార్కులు సాధిస్తే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసింది.

ఐసీఎస్ఈ సిలబస్‌లో చదివిన దిబ్యేందు అనే విద్యార్థి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించాడు. అతడు మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు తెచ్చుకుని గొప్ప ప్రతిభ కనబరిచాడు. ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు అందరూ అభినందిస్తుండగా, అతడి తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

“బాగా మార్కులు తెచ్చుకున్నాడు గానీ, ఇంకొంచెం కష్టపడితే ఆ ఒక్క మార్కు కూడా వచ్చేది కదా” అంటూ ఆమె మాట్లాడడం నెటిజన్లకు నచ్చలేదు. ఇంత మంచి ఫలితం వచ్చిన సందర్భంలో కూడా ఆ ఒక్క మార్కు గురించే మాట్లాడటంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక దిబ్యేందు కూడా తన తల్లిలాగే స్పందించాడు. “ఆ ఒక్క మార్కు మిస్ అయినందుకు కొంచెం బాధగా ఉంది. అయినప్పటికీ నేను చాలా బాగా రాశాననే సంతృప్తి ఉంది” అని చెప్పాడు. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలనుకుంటున్నానని, ఐఐటీ వంటి ప్రముఖ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “ఇలాంటి ఒత్తిడి చేసే తల్లిదండ్రులు మాకు లేనందుకు సంతోషంగా ఉంది” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే, “ఆ అబ్బాయిపై ఎంత ప్రెజర్ పెట్టారో ఈ మాటలతోనే అర్థమవుతోంది” అంటూ అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by The Noiseless News (@noiselessnews)

Also Read: Petrol: మరోసారి మోత మోగనున్న పెట్రోల్ బాంబు?  

Viral: 500కి 499 మార్కులు.. అయినా తల్లికి సంతృప్తి లేదు!