Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలో మెటాబాలిజం సక్రమంగా పనిచేస్తుంది. అయితే నీరు తాగే విషయంలో కూడా సరైన పద్ధతి ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో నీరు ఎలా తాగాలి అనే విషయం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
చాలా మంది భోజనం చేస్తూ మధ్య మధ్యలో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల త్వరగా భోజనం పూర్తి అవుతుందని, కొంత సమయం కూడా సేవ్ అవుతుందని భావిస్తారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం మధ్యలో ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీర్ణాశయంలో ఉండే జీర్ణరసాలు సరిగా పనిచేయకపోవడంతో ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీంతో అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే భోజనం ప్రారంభించే ముందు ఎక్కువగా నీళ్లు తాగకూడదని, అలాగే భోజనం మధ్యలో కూడా నీరు లేదా కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే కూడా నీరు తాగకూడదని చెబుతున్నారు. కనీసం అరగంట తర్వాత మాత్రమే నీరు తాగడం మంచిదని ఆయుర్వేదం సూచిస్తుంది. అయితే ఎక్కిళ్లు వచ్చినప్పుడు లేదా మరీ అవసరమైతే కొద్దిగా నీటిని మాత్రమే సిప్ చేయవచ్చు.
భోజనం చేసిన తర్వాత సుమారు 30 నిమిషాల విరామం తీసుకుని నీరు తాగడం మంచిది. అలాగే ఒకటి లేదా రెండు గంటల తర్వాత దాహం అనిపించినంత మేరకు నీరు తాగవచ్చు. ఇలా సరైన పద్ధతిలో నీరు తీసుకుంటేనే శరీరానికి పూర్తి ప్రయోజనం కలుగుతుంది.
భోజనం చేస్తూ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు ఇలా ఉన్నాయి:
-
ఆహారం పూర్తిగా జీర్ణం కాక కొంత భాగం కొవ్వుగా మారే అవకాశం ఉంటుంది.
-
తిన్న ఆహారంలో కొంత భాగం శక్తిగా మారకుండా వృథా అవుతుంది.
-
జీర్ణాశయంలోని ఎంజైమ్‌ల పనితీరు తగ్గిపోతుంది.
-
దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
-
శరీరంలో అనవసరమైన విషపదార్థాలు చేరే అవకాశం ఉంటుంది.
-
ఇన్సులిన్ నిరోధకత పెరగవచ్చు.
-
ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నీరు తాగడంలో కూడా సరైన పద్ధతిని పాటించడం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
