Unmarried: “30 ఏళ్లు దాటాయి.. ఎంత వెతికినా పిల్లను ఇచ్చేనాథుడే లేడు!” — ఈ మాట ఈ రోజుల్లో ప్రతి ఊరిలో, ప్రతి కాలనీలో వినిపించే యథార్థం. ఇది కేవలం ఒక ఇంట్లోని సమస్య కాదు; దేశవ్యాప్తంగా సామాజికంగా, గణాంకాల పరంగా ముదిరిపోయిన ఒక పెద్ద సంక్షోభం. అసలు మగవాళ్లకు పిల్లకు దొరక్కపోవడానికి కారణాలేంటి? నిజంగానే అమ్మాయిలు తగ్గిపోయారా?. ఇంకా పెళ్లి కాకుండా(Unmarried) ఎందుకలా ఉండిపోతున్నారు..?

1. లింగ నిష్పత్తి లోపం: గణాంకాల నిజరూపం (Demographic Imbalance)
మనం గతంలో చేసిన తప్పులే నేడు శాపంగా మారాయి. 90ల కాలంలో స్కానింగ్‌లు, భ్రూణ హత్యల వల్ల అమ్మాయిల సంఖ్య భారీగా పడిపోయింది.
-
ఆధారం & లెక్కలు: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS), సెన్సార్స్ ఆధారంగా చూస్తే.. 1990 – 2005 మధ్య పుట్టిన వారిలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య కేవలం 880 నుండి 920 మధ్యనే ఉంది.
-
రియల్ ఎగ్జాంపుల్: ఒక గ్రామంలో పెళ్లి ఈడుకొచ్చిన మగవాళ్లు 100 మంది ఉంటే, అక్కడ ఉన్న అమ్మాయిల సంఖ్య కేవలం 90 మాత్రమే. మిగిలిన 10 మందికి ఊరి సరిహద్దుల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మాయి దొరకడం గగనమవుతుంది. దీన్నే సామాజిక భాషలో ‘మ్యాకేజ్ స్క్వీజ్’ (Marriage Squeeze) అంటారు.
2. “హైపర్‌గమీ” (Hypergamy): క్రమంగా మారిన ఎంపిక ప్రమాణాలు
గతంలో అమ్మాయిల కంటే అబ్బాయిల చదువు, ఉద్యోగం ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
-
ప్రస్తుతం డిగ్రీలు, పీజీలు మరియు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారిలో అమ్మాయిల శాతమే ఎక్కువ.
-
రియల్ ఎగ్జాంపుల్: ఒక అమ్మాయి ఐటీ కంపెనీలో నెలకు రూ.50,000 సంపాదిస్తోందనుకుందాం. ఆ అమ్మాయి తను పెళ్లి చేసుకునే అబ్బాయి కనీసం రూ.1 లక్ష జీతం లేదా ప్రసిద్ధ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాలని కోరుకోవడం సహజం. కానీ, సమాజంలో అమ్మాయి స్థాయి కంటే ఎక్కువ సంపాదించే మగవారి సంఖ్య తక్కువగా ఉండటంతో “మ్యాచ్ అవ్వడం” కష్టమవుతోంది.
3. “వ్యవసాయం వద్దు.. ఐటీయే ముద్దు”: గ్రామీణ ప్రాంతాల కష్టాలు
అమ్మాయిల చదువు, ఆలోచనా దృక్పథం మారడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మగవారికి పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా మారింది.
-
రియల్ ఎగ్జాంపుల్: ఊరిలో 5 లేదా 10 ఎకరాల పొలం ఉండి, నెలకు లక్ష రూపాయల రాబడి ఉన్న అబ్బాయి కంటే.. సిటీలో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ రూ.30,000 సంపాదించే సాఫ్ట్‌వేర్ లేదా ప్రైవేట్ ఉద్యోగి కే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఓటు వేస్తున్నారు. పొలం పనులు కష్టం కావడం, పట్టణ జీవనశైలిపై మోజు పెరగడం వల్ల రైతులైన అబ్బాయిలకు సంబంధాలు దొరకడం లేదు.
4. అబ్బాయిల పై మోయలేని “అర్హతల” భారం
ఒకప్పుడు గుణం, సంస్కారం చూసి పిల్లను ఇచ్చేవారు. కానీ నేడు డిమాండ్లు మారాయి.
-
రియల్ ఎగ్జాంపుల్: పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్లినప్పుడు అబ్బాయికి వరుసగా ఐదు క్వాలిఫికేషన్లు ఉండాల్సి వస్తోంది — 1. సొంత ఇల్లు, 2. హైదరాబాద్/వైజాగ్ లాంటి నగరాల్లో స్థిరపడటం, 3. కార్పొరేట్/ప్రభుత్వ ఉద్యోగం, 4. అప్పులు లేకపోవడం, 5. ఉమ్మడి కుటుంబం కాకుండా విడిగా ఉండే వెసులుబాటు. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి తగ్గినా సంబంధం ముందుకు సాగడం లేదు.
అమ్మాయిల సంఖ్య తక్కువ
గణాంకాల ప్రకారం అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం ఒక ఎత్తైతే, మనుషుల ఆశయాలు, మారిన సామాజిక జీవనశైలి మరొక ఎత్తు. ఈ రెండింటి కలయికే నేడు మగవారి పెళ్లిళ్లు 30-35 ఏళ్లు దాటినా కాకపోవడానికి ప్రధాన కారణం. ఈ పరిస్థితి మారాలంటే పెళ్లి ప్రమాణాల్లో, ముఖ్యంగా సామాజిక ఆలోచనా ధోరణిలో మార్పు రావడం అత్యవసరం.
Also Read: Telangana Job Market: తెలంగాణలో ఉద్యోగ వేట.. గవర్నమెంట్ జాబ్ బెస్టా? ప్రైవేటు ఉద్యోగం మేలా?
