Telugu Actresses: హిందీ రాకపోయినా.. బాలీవుడ్‌లో జెండా పాతేసిన తెలుగు నటీమణులు!

Telugu Actresses Who Conquered Bollywood Without Knowing Hindi

Telugu Actresses: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాంతీయ భాషాకు సరిహద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఒక భాషకు చెందిన నటులు మరో భాషకు చెందిన సినిమాల్లో నటించడం షరా మామూలైపోయింది. అది కూడా ఏ మాత్రం ఆ భాషా పరిజ్ఞానం లేకుందా. అదే తరహాలో దక్షిణాది నటీనటులు(Telugu Actresses) బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హిందీ భాషపై కనీస పట్టు కాదు కదా అసలు మాట్లాడటం రాకపోయినా, కేవలం తమ నటన, హావభావాలు (Expressions), స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే బాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

1. శ్రీదేవి (Sridevi)

సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌ను శాసించిన తొలి ‘లేడీ సూపర్ స్టార్’ శ్రీదేవి. ఆమె బాలీవుడ్‌లో ‘సోల్వా సావన్’ (1979) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెకు హిందీ అసలు రాదు. ఆరంభంలో ఆమె నటించిన సినిమాలకు ఇతర డబ్బింగ్ ఆర్టిస్టులతో (ముఖ్యంగా నటి నాజ్) డబ్బింగ్ చెప్పించేవారు. ‘చాందిని’ (1989) సినిమా వరకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పలేదు. భాష రాకపోయినా తన నటనతోనే దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు.

HBD Sridevi: ఎన్టీఆర్‌తో శ్రీదేవి వరల్డ్ రికార్డు.. బాలయ్య అన్ లక్కీ.. ఆమె గురించి ఈ నిజాలు తెలుసా? | Sridevi Birth Anniversary: Unknown Facts about Sridevi Personal and Film Career ...

2. జయప్రద (Jaya Prada)

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన జయప్రద, కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సర్గామ్’ (1979) సినిమా ద్వారా హిందీలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆమెకు హిందీ భాష అస్సలు తెలియదు. డబ్బింగ్ సహాయంతోనే ఆమె సినిమాలు పూర్తి చేసేవారు. అయినప్పటికీ, ఆమె అందం, అద్భుతమైన డాన్స్ మరియు అభినయంతో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా దశాబ్దాల పాటు ఏలారు.

సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం.. అసలు ఏమైందంటే? | Jayaprada Mother neelaveni passed away - Telugu Filmibeat

3. రష్మిక మందన్న (Rashmika Mandanna)

తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ‘గుడ్ బై’ మరియు ‘మిషన్ మజ్ను’ సినిమాలతో బాలీవుడ్ ప్రవేశం చేశారు. మొదట్లో హిందీ మాట్లాడటం రాకపోయినా, కష్టపడి ట్యూటర్లను పెట్టుకుని భాష నేర్చుకున్నారు. ‘యానిమల్’ సినిమా నాటికి ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

Rashmika Mandanna: అందమైన ప్రేమ కథ 'సీతారామం' నుంచి రష్మిక మందన్న లుక్.. ఆకట్టుకట్టుకుంటోన్న పోస్టర్ | Rashmika Mandanna look was released on the occasion of Bakrid from the movie Sita ...

4. ఇలియానా డిక్రూజ్ (Ileana D’Cruz)

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ఇలియానా ‘బర్ఫీ’ (2012) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ సమయానికి ఆమెకు హిందీపై సరైన అవగాహన లేదు. కానీ దర్శకుడు అనురాగ్ బాసు అందించిన శిక్షణ, వాయిస్ ఆర్టిస్టుల సహకారంతో బర్ఫీ సినిమాలో తన నటనకుగాను ప్రశంసలు అందుకున్నారు.

ఇలియానా డిక్రూజ్ మాతృత్వం - తెలంగాణా టుడేపై స్వీయ సందేహం గురించి విప్పింది

నటనకు, భావోద్వేగాలకు భాషతో పనిలేదు

నటనకు, భావోద్వేగాలకు భాషతో పనిలేదని ఈ నటీమణులు నిరూపించారు. హిందీ రాకపోయినా డబ్బింగ్ కళాకారుల సహకారంతో, తమ ముఖకవళికలతోనే హిందీ ప్రేక్షకులను కట్టిపడేసి బాలీవుడ్ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక పుటను లిఖించుకున్నారు.

Also Read: Movie Costumes: హీరో, హీరోయిన్లు వేసుకునే బట్టలు షూటింగ్ అయ్యాక ఏం చేస్తారంటే..