Proposed at Graveyard: అర్ధరాత్రి శ్మశానానికి.? ఈ లవ్ స్టోరీ వెనుక అసలు కథ!

Rakesh Proposed to Sujatha at a Graveyard! Here's What Really Happened

Proposed at Graveyard: ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్, ‘జోర్దార్’ సుజాత(Jordar Sujatha) ప్రేమకథ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రేమను వ్యక్తపరచడానికి బీచ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు లేదా అందమైన ప్రదేశాలను ఎంచుకుంటారు. కానీ రాకేష్ మాత్రం తన ప్రేమను వ్యక్తపరచడానికి ఏకంగా శ్మశానవాటికను ఎంచుకున్నారట(Proposed at Graveyard). ఈ విషయాన్ని సుజాత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Rocking Rakesh, Sujatha

రాకేష్, సుజాత మొదట ఓ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేసే సమయంలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. అయితే కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు అర్ధరాత్రి రాకేష్ సుజాతను ఊహించని విధంగా శ్మశానవాటికకు తీసుకెళ్లారట. అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాడో తనకు ఏమాత్రం అర్థం కాలేదని సుజాత తెలిపారు.

Rocking Rakesh, Sujatha

అక్కడే రాకేష్ తన మనసులోని మాటను సుజాతకు చెప్పారట. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారట. అయితే రాకేష్ ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుండటంతో, మొదట ఆయన మాటలను సుజాత సీరియస్‌గా తీసుకోలేదట. రాకేష్ జోక్ చేస్తున్నాడని భావించి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆమె చెప్పారు.

Rocking Rakesh, Sujatha

ఆ తర్వాత సుజాత తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో రాకేష్ ఆమె చేతిలోని ఫోన్ తీసుకుని, సుజాత అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమె తల్లితో చెప్పారట. దీంతో సుజాత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. మొదట సుజాత కూడా రాకేష్ సరదాగా మాట్లాడుతున్నారని అనుకున్నారట.

Rocking Rakesh, Sujatha

అయితే రాకేష్ తన ప్రేమ విషయంలో సీరియస్‌గా ఉన్నారని తర్వాత అర్థమైంది. తన కుటుంబ సభ్యులను ముందుగానే ఒప్పించిన రాకేష్, సుజాత కుటుంబంతో కూడా మాట్లాడారట. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది.

Rocking Rakesh, Sujatha

2023 ఫిబ్రవరి 24న తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సమక్షంలో రాకేష్, సుజాత వివాహం జరిగింది. 2024 ఆగస్టులో ఈ దంపతులకు కుమార్తె జన్మించగా.. ఆమెకు ఖ్యాతిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం రాకేష్ టీవీ, సినిమాల్లో కొనసాగుతుండగా.. సుజాత తమ కుమార్తె ఆలనాపాలనలో బిజీగా ఉన్నారు.

Also Read: Reddit Post: “పెళ్లి కావాలంటే అమ్మాయి పేరుపై ఆస్తులు రాయాల్సిందే..!”