Vijay: టీవీకే పార్టీ గెలుపు వైపు దూసుకుపోతుండడంతో ఆ పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని విజిల్లు వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా నటి త్రిష కూడా విజయ్ ఇంటికి చేరుకున్నారు. నేడు తన పుట్టినరోజు కావడంతో తిరుమలకు వెళ్లిన ఆమె, అక్కడి నుంచి నేరుగా విజయ్ నివాసానికి వచ్చారు.
గెలుపు నేపధ్యంలో అధికారులు విజయ్ ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
