Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉన్న చిరునామాను మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇల్లు మారినప్పుడు లేదా వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు లైసెన్స్‌లో ఉన్న అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పరివాహన్ (Parivahan) వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందులో స్టేట్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి అప్లికేషన్ సమర్పించాలి. చిరునామా ధృవీకరణ కోసం కరెంట్ బిల్లు, ఆధార్ కార్డ్ లేదా గ్యాస్ బిల్లు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత సమీపంలోని ఆర్టీఏ (RTA) కార్యాలయానికి వెళ్లి మీ డాక్యుమెంట్స్‌ను అధికారులకు చూపించాలి. వారు పరిశీలించి అప్లికేషన్‌ను ఆమోదించిన తరువాత కొద్ది రోజులలోనే కొత్త అడ్రస్‌తో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారు.
అవసరమైన పత్రాలు
-
డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్
-
ఆధార్ కార్డ్
-
ఓటర్ ఐడి
-
గ్యాస్ బిల్లు
-
కరెంట్ బిల్లు
-
40 ఏళ్లు దాటిన వారికి మెడికల్ సర్టిఫికేట్
డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ ఎలా మార్చుకోవాలి?
-
ముందుగా parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
-
హోమ్ పేజీలో Online Services పై క్లిక్ చేయాలి.
-
అందులో Driving Licence Related Services ఎంపిక చేసుకోవాలి.
-
కొత్త పేజీలో మీ State ఎంచుకోవాలి.
-
తరువాత Change of Address ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
-
Continue ఎంపిక చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి.
-
Get DL Details పై క్లిక్ చేసి వివరాలు ధృవీకరించాలి.
-
అవసరమైన ఫీజు చెల్లించాలి.
-
అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి.
-
సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి.
-
ఆ రోజు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తిచేయాలి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొద్ది రోజుల్లోనే కొత్త చిరునామాతో మీ స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ పోస్టు ద్వారా మీ ఇంటికి చేరుతుంది.
