Hardik Pandya: స్టేడియంలోనే ముద్దులతో రెచ్చిపోయిన హార్దిక్..!

Mahieka Sharma kisses Hardik Pandya in the ground after India's T20 World Cup win, all-rounder thanks 'lucky charm'

Mahieka Sharma kisses Hardik Pandya in the ground after India's T20 World Cup win, all-rounder thanks 'lucky charm'

Hardik Pandya: టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకల మధ్య క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మాహికా శర్మకు సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రముఖ యాంకర్ జతిన్ సప్రూతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూలో మాహికా శర్మను పరిచయం చేస్తూ హార్దిక్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇంటర్వ్యూ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ, “మాహికా నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ విజయాలే వస్తున్నాయి. ఆమె వచ్చిన తర్వాత నా జీవితంలో మంచి విషయాలే జరుగుతున్నాయి” అని చెప్పాడు. అంతేకాకుండా అక్కడే నిలబడి ఉన్న మాహికాను చూపిస్తూ “ఇవాళ నా మిసెస్” (భార్య) అని చెప్పడం మరింత చర్చకు దారితీసింది. గతంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, హార్దిక్ బహిరంగంగా ‘మిసెస్’ అని పిలవడంతో వారి పెళ్లిపై స్పష్టత వచ్చినట్టయింది.

ఇంటర్వ్యూ పూర్తయ్యాక మాహికా శర్మ హార్దిక్ దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అలాగే అతని బుగ్గపై ముద్దు పెట్టుకుని అభినందించింది. ఈ రొమాంటిక్ క్షణాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఇక తన భవిష్యత్తు లక్ష్యాల గురించి కూడా హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. “నేను ఇంకా కనీసం 10 సంవత్సరాలు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాను. ఈ కాలంలో మరో 5 నుంచి 6 ట్రోఫీలు గెలవడం నా లక్ష్యం. 2024లో బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నేను ఆడే ప్రతి టోర్నీలోనూ ట్రోఫీ గెలవాలని భావిస్తున్నాను. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నాను” అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు.

టీ20 వరల్డ్‌కప్ 2026లో హార్దిక్ పాండ్యా అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేయడంతో పాటు 9 కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. భారత్ విజేతగా నిలవడంలో అతని ప్రదర్శన కీలక పాత్ర పోషించింది.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)

Also Read: Morning Routine: ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదంటే..!

Hardik Pandya: స్టేడియంలోనే ముద్దులతో రెచ్చిపోయిన హార్దిక్..!