India: ‘మార్చి 21న పాక్‌పై ఇండియా దాడి చేస్తుంది’

Amid Iran-Israel Tensions, Astrologer Predicts Pakistan Attack Next – With Strike Date!

Amid Iran-Israel Tensions, Astrologer Predicts Pakistan Attack Next – With Strike Date!

India: పాకిస్థాన్‌పై భారత్ దాడి చేసే అవకాశముందని ఓ జ్యోతిషురాలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జ్యోతిష్య నిపుణురాలు రీనా శర్మ గ్రహాల స్థితిగతులను ఆధారంగా తీసుకుని ఈ అంచనాలు వెల్లడించినట్లు తెలిపారు. ఆమె చెప్పిన ప్రకారం ఈ నెల 21వ తేదీ ప్రాంతంలో భారత్-పాక్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రీనా శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో పాకిస్థాన్ పరిస్థితి క్లిష్టంగా మారుతుందని చెప్పారు. భారత్‌తో పాటు అఫ్గానిస్తాన్ కూడా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఏర్పడతాయని ఆమె అంచనా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె తన విశ్లేషణలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ పరిణామాల కారణంగా భవిష్యత్తులో భారతదేశ సరిహద్దుల్లో కూడా మార్పులు చోటుచేసుకోవచ్చని ఆమె అన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) క్రమంగా భారతదేశంలో కలిసే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

గ్రహాల గమనాన్ని పరిశీలించి ఈ అంచనాలు చెబుతున్నానని రీనా శర్మ తెలిపారు. గతంలో కూడా ఆమె చేసిన కొన్ని అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకునే అవకాశం ఉందని ముందుగానే చెప్పినట్లు, అలాగే ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశాన్ని కూడా తాను ముందే సూచించినట్లు ఆమె పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అంచనాలను విశ్వసిస్తుండగా, మరికొందరు మాత్రం వీటిని సాధారణ జ్యోతిష్య వ్యాఖ్యలుగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: Telangana: తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే

India: ‘మార్చి 21న పాక్‌పై ఇండియా దాడి చేస్తుంది’