Lifestyle: ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌

How to Create the Perfect Morning Routine

How to Create the Perfect Morning Routine

Lifestyle: ఆరోగ్యంగా రోజును ప్రారంభించాలంటే పెద్దగా సమయం అవసరం లేదు. ఉదయం కేవలం 10 నిమిషాలు కేటాయిస్తేనే శరీరానికి, మనసుకు మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ (డైజెషన్) మరియు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి ఈ చిన్న మార్నింగ్ రొటీన్ ఎంతో ఉపయోగపడుతుంది.

మొదటగా, నిద్రలేచిన వెంటనే మూడు నిమిషాల పాటు ప్రశాంతంగా లోతుగా ఊపిరి పీల్చి విడిచే శ్వాసాభ్యాసం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ (బ్లడ్ సర్క్యులేషన్) మెరుగుపడుతుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా సరిగా జరిగి, మెదడు కూడా చురుకుగా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఉదయం వచ్చే ఒత్తిడిని తగ్గించడంలో కూడా దీర్ఘశ్వాస ఉపకరిస్తుంది.

ఆ తర్వాత మూడు నిమిషాల పాటు తేలికపాటి స్ట్రెచింగ్స్ చేయడం లేదా ఇంట్లోనే కొద్దిసేపు నడవడం మంచిది. దీనివల్ల శరీర కండరాలు సడలుతాయి. ముఖ్యంగా గట్ మొబిలిటీ మెరుగుపడి జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు ఇది తోడ్పడుతుంది. రోజంతా చురుకుగా ఉండటానికి ఇది మంచి ప్రారంభం.

తరువాత రెండు నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగాలి. రాత్రంతా నీరు తాగకుండా ఉండటం వల్ల శరీరం కొంత డీహైడ్రేషన్‌కు గురవుతుంది. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా శరీరం మళ్లీ రీహైడ్రేట్ అవుతుంది. అలాగే టాక్సిన్లు బయటకు వెళ్లడానికి ఇది సహాయపడుతుంది.

చివరిగా, టిఫిన్ చేయడానికి ముందు మరో రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇది మనసును స్థిరపరచి, ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది.

Also Read: Virosh: కొడవ పద్ధతిలో రష్మిక-విజయ్ ల పెళ్లి

Lifestyle: ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌