Sai Pallavi: మణిరత్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి, క్రేజ్ ఉండటం సహజం. ఈ ప్రముఖ దర్శకుడి కాంపౌండ్ నుంచి త్వరలో మరో రొమాంటిక్ డ్రామా సినిమా రాబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా శింబు లేదా ధ్రువ్ విక్రమ్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అందరికీ ఆశ్చర్యంగా, చివరికి ఈ సినిమా కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి చేతికి వెళ్లినట్లు తాజా సమాచారం చెబుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా, హీరోయిన్‌గా సాయిపల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ టీం ఇప్పటికే కొన్ని ట్రాక్స్‌ను కంపోజ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాక, మణిరత్నం ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం.
ఇదిలా ఉండగా, మణిరత్నం 2025లో విడుదలైన థగ్‌లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయింది. మరోవైపు విజయ్ సేతుపతి ప్రస్తుతం జైలర్ 2తో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టుకుని బిజీగా ఉన్నాడు. సాయిపల్లవి కూడా Ek Din, ధనుష్‌తో D55, అలాగే రామాయణం పార్ట్ 1, రామాయణం పార్ట్ 2 వంటి ప్రాజెక్ట్‌లతో వరుసగా పనిచేస్తూ బిజీ షెడ్యూల్‌లో ఉంది.
#ManiRatnam’s next is set to be a romantic drama starring #VijaySethupathi & #SaiPallavi ❣️✨
• Music by #ARRahman — buzz says most of the tracks are already composed ⭐
• Shoot to begin after VJS wraps current commitments 👍
• Interestingly, the project first moved… pic.twitter.com/ijOt7LTIpv— Kollywood Ent (@Kollywoodent) February 23, 2026
Also Read: NEET: మెడిసిన్ చదవమన్నందుకు కన్న తండ్రినే చంపేశాడు
Sai Pallavi: విజయ్ సేతుపతి, సాయి పల్లవి క్రేజీ కాంబో!
