Star Heroine: క్రేజ్ అంటే ఇదే.. దేశంలోనే నం.1 హీరోయిన్‌గా రష్మిక..!

Rashmika Mandanna Named India’s No.1 Heroine by India Today?

Star Heroine: సినీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు సినిమాలతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్‌ వరకు విస్తరించింది. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఇండియా టుడేలో రష్మికకు దక్కిన ప్రత్యేక గుర్తింపు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రష్మికను ‘ది న్యూ నేషనల్ స్టార్’గా పేర్కొంటూ ఆమె సాధించిన విజయాలను ప్రస్తావించింది.

ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘పుష్ప’, ‘యానిమల్’, ‘పుష్ప-2’, ‘ఛావా’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భాషతో సంబంధం లేకుండా వివిధ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలు అందుకుంటూ రష్మిక తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు.

Rashmika Mandanna: Pan Indian No. 1 Heroine Who Redefined Stardom in 2025 -  Filmibeat

ఇదే సమయంలో ఇండియా టుడే ప్రస్తావించిన జాబితాలో రష్మికకు అగ్రస్థానం దక్కిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె తర్వాత దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సాయి పల్లవి, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ‘నంబర్ వన్ హీరోయిన్’ అనే అంశాన్ని అధికారిక ఆల్-ఇండియా ర్యాంకింగ్‌గా కాకుండా, మ్యాగజైన్ ప్రత్యేక ఫీచర్ లేదా ప్రస్తావనగా చూడటం మంచిదనే అభిప్రాయం కూడా ఉంది.

Also Read: Irumudi Box Office: ‘ఇరుముడి’ జోరు.. చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిందా? రూ.200 కోట్లకు అడుగు దూరంలో!

మరోవైపు ఈ విషయంపై రష్మికకు సంబంధించిన వ్యక్తిగత ఆనందం కూడా సోషల్ మీడియాలో కనిపించింది. ఇండియా టుడే మ్యాగజైన్‌లో వచ్చిన ఫొటోను షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ ‘Peak stuff, proud’ అంటూ పోస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో రష్మిక అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లోనే ఎక్కువగా కనిపించిన రష్మిక, ఇప్పుడు హిందీ చిత్రాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలు, భారీ సినిమాలు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫ్యాన్ బేస్ ఆమెను నిజంగానే పాన్ ఇండియా స్టార్‌గా నిలబెడుతున్నాయి. రాబోయే సినిమాలతో రష్మిక తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Nayanthara: నయనతార ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..!!