Apple CEO: ప్రపంచ టెక్నాలజీ రంగంలో యాపిల్‌ది ప్రత్యేక స్థానం. ఐఫోన్ నుంచి మ్యాక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ వరకు ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. అయితే ఇంతటి దిగ్గజ సంస్థకు నాయకత్వం వహించే యాపిల్ కు ప్రస్తుతం సీఈవో(Apple CEO) ఎవరు? అసలు ఆయనను ఎవరు నియమిస్తారు? ఆయనకు ఎంత జీతం వస్తుంది? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం Apple CEO ఎవరు?
ఇప్పటివరకు Apple CEOగా సుదీర్ఘకాలం కొనసాగిన టిమ్ కుక్(Tim Cook) స్థానంలో ఇప్పుడు జాన్ టెర్నస్(John Ternus) Apple CEOగా బాధ్యతలు చేపట్టారు. Appleలో టెర్నస్‌కు ఇప్పటికే సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా కంపెనీ హార్డ్‌వేర్ విభాగంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
జాన్ టెర్నస్ 2001లో Appleలో చేరారు. అప్పటి నుంచి వివిధ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ బాధ్యతల్లో పనిచేస్తూ కంపెనీలో కీలక స్థానానికి ఎదిగారు. అంతేకాదు Apple ఉత్పత్తుల అభివృద్ధిలోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

Apple CEOను ఎవరు నియమిస్తారు?
మరి యాపిల్ సీఈవోను ఎవరు నియమిస్తారు అన్న విషయానికొస్తే.. వారిని కంపెనీ షేర్హోల్డర్లు నేరుగా నియమించరు. Apple Board of Directors (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) CEOను నియమిస్తుంది. అయితే బోర్డు సభ్యులను ఎన్నుకోవడంలో Apple షేర్హోల్డర్లకు పాత్ర ఉంటుంది. కంపెనీ నాయకత్వం, CEO ఎంపిక, CEO పనితీరు, పారితోషికం వంటి కీలక నిర్ణయాలను బోర్డు పర్యవేక్షిస్తుంది.
Also Read: HDFC Bank: ఇదేంది భయ్యా.. 46 పైసలు బిల్లు కట్టలేదని రూ.1,200 ఫైన్!
Apple Shareholders → Board of Directors → Apple CEO
సింపుల్‌గా చెప్పాలంటే.. అంటే Apple CEO పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో బోర్డుదే తుది నిర్ణయం.
జాన్ టెర్నస్ జీతం ఎంత?
John Ternus CEOగా అందుకునే పారితోషికం గురించి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని శాలరీ ఏకంకా 58 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.551 కోట్లన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమింటే, రూ.551 కోట్లు మొత్తం బేసిక్ జీతం కాదు.
పెద్ద టెక్ కంపెనీల CEOలకు సాధారణంగా బేసిక్ శాలరీతో పాటు స్టాక్ అవార్డులు, పనితీరు ఆధారిత బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కలిపి Total Compensationగా లెక్కిస్తారు. అందుకే జాన్ టెర్నస్‌కు సంబంధించిన $58 మిలియన్ల మొత్తాన్ని కేవలం నెల జీతంగా భావించకూడదు. అంటే సంవత్సరానికి రూ.551 కోట్లు అంటే నెలకు రూ.45 కోట్లకు పైగా అని నేరుగా లెక్కించడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ మొత్తం స్టాక్ అవార్డులు, ఇన్సెంటివ్‌లు వంటి అంశాలను కూడా కలిగి ఉండవచ్చు.
Also Read: HDFC Bank: ఇదేంది భయ్యా.. 46 పైసలు బిల్లు కట్టలేదని రూ.1,200 ఫైన్!
ఇంత భారీ పారితోషికం ఎందుకు?
ఒక్క సీఈవో పదవికే ఇంత మొత్తంలో శాలరీ ఎందుకిస్తారు అన్న డౌట్ చాలా మందికి కలగొచ్చు. కానీ అందుకు చాలా కారణాలున్నాయి. Apple వంటి ప్రపంచ దిగ్గజ సంస్థకు CEOగా ఉండటం అంటే కేవలం కంపెనీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం మాత్రమే కాదు. ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, Apple Services, AI వంటి అనేక కీలక విభాగాలకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు, పోటీ సంస్థలు, సరఫరా వ్యవస్థ, కొత్త టెక్నాలజీలు, కంపెనీ షేర్ విలువ వంటి అంశాలపై CEO నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. అందుకే CEO compensationలో పెద్ద భాగాన్ని కంపెనీ పనితీరుతో అనుసంధానం చేస్తారు.
టిమ్ కుక్ తర్వాత టెర్నస్ ఎందుకు?
John Ternusకు Appleలో దాదాపు రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఆయనకు ఉన్న అనుభవం Apple నాయకత్వానికి కీలకంగా పరిగణించినట్టు సమాచారం. Appleలో కీలక ప్రాజెక్టులు, ఉత్పత్తుల అభివృద్ధిలో పనిచేసిన అనుభవం ఉండటంతో CEO పదవికి ఆయనను ఎంపిక చేయడం కంపెనీ భవిష్యత్ ఉత్పత్తులు, ఇంజినీరింగ్, టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టే సంకేతంగా చూడవచ్చు.
Also Read: HDFC Bank: ఇదేంది భయ్యా.. 46 పైసలు బిల్లు కట్టలేదని రూ.1,200 ఫైన్!
ఒకప్పుడు Appleను Steve Jobs నడిపించారు. ఆ తర్వాత Tim Cook సంస్థను ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు Apple బాధ్యతలు John Ternus చేతుల్లోకి రావడంతో.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన Appleను ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Wrong UPI ID: ఫోన్‌పేలో పొరపాటున వేరొకరికి డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!
