Eshwar Sai Missing: ‘భాసింగ బలాలు’ ఫేమ్ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి కనిపించడం లేదని(Eshwar Sai Missing) సమాచారం. అతని కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తనను ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు, ఈశ్వర్ సాయి, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Toxic: ఈ సినిమా చిన్న పిల్లలు చూడొద్దు.. యశ్ కామెంట్స్ వైరల్!
ఈ క్రమంలో వేములవాడలోని ఓ హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉన్న సమయంలో అతని భార్య శరణ్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈశ్వర్ సాయి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన పోలీసులకు అందుబాటులో లేరని తెలుస్తోంది.

ఈశ్వర్ సాయి ఆచూకీ కోసం నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన అనంతరం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన భార్య శరణ్య, సోదరిని పోలీసులు కలిసి ఈ వ్యవహారంపై విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
Also Read: Mohanlal: మోహన్ లాల్ స్పీడ్ మామూలుగా లేదుగా.. తెలుగు హీరోలకే షాక్ ఇచ్చేలా 7 సినిమాలు!
మాధురి, ఈశ్వర్ సాయి చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని మాధురి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
తన భర్త అమాయకుడని, ఏ పరిస్థితుల్లోనైనా ఆయనతోనే ఉంటానని శరణ్య చెప్పారు. తన భర్తను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తమ వ్యక్తిగత వీడియోలని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆమె కోరారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఈశ్వర్ సాయి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఆరోపణలపై తుది నిజానిజాలు పోలీసుల దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.
Also Read: Telangana Folk: రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఫేమస్ ఫోక్ ఆర్టిస్టులు
