Death Penalty: భారత్‌లో ఇప్పుడు మరణశిక్షపై కీలక చర్చ జరుగుతోంది. ఉరిశిక్ష(Death Penalty)కు ప్రత్నామ్యాయ మార్గాన్ని చూపాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్(Petition) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్‌లో మరణశిక్ష అమలు చేసే విధానంగా ఉన్న ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Suprem Court) కొట్టివేసింది. అయితే భవిష్యత్తులో ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధ కలిగించే మరో పద్ధతి ఉందని శాస్త్రీయ లేదా వైద్య ఆధారాలతో రుజువైతే.. ఈ అంశాన్ని మరోసారి పరిశీలించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: Tamil Nadu: క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. అసెంబ్లీలో అసలేం జరిగింది?
ఉరిశిక్ష అమలు సమయంలో ఖైదీకి ఎక్కువ నొప్పి, బాధ కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం మరణశిక్షను ఎలా అమలు చేయాలనే విషయంలో చట్టంలో ఉరిశిక్షకు నిబంధన ఉంది. దీనికి బదులుగా తక్కువ బాధ కలిగించే మరో విధానాన్ని తీసుకురావాలని ఆయన కోరారు.
మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా గౌరవంగా మరణించే హక్కు ఉండాలని పిటిషనర్ వాదించారు. ఉరిశిక్ష వల్ల కలిగే నొప్పి, బాధను పరిగణనలోకి తీసుకుని ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ఇతర పద్ధతులను పరిశీలించాలని కోర్టును కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉరిశిక్ష వల్ల కలిగే నొప్పి, వ్యక్తి చనిపోవడానికి పట్టే సమయం వంటి అంశాలపై సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ను కోరింది. అలాగే మరణశిక్ష అమలుకు మరో మంచి పద్ధతి ఉందా అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించింది.
Also Read: Video Viral: నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని.. రీల్స్ కోసమేనా..!
అయితే గతంలో ఉరిశిక్షను చట్టబద్ధమైన విధానంగా సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ పరిశీలించాల్సినంత బలమైన కారణాలు ప్రస్తుత పిటిషన్లో లేవని తాజా ధర్మాసనం తెలిపింది. అందుకే ఉరిశిక్షను ఇప్పటికిప్పుడు రద్దు చేయడానికి కోర్టు నిరాకరించింది.
అయితే భవిష్యత్తులో కొత్త ఆధారాలు వస్తే పరిస్థితి మారవచ్చని కోర్టు చెప్పింది. ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పితో మరణశిక్షను అమలు చేయగల మరో విధానం ఉందని శాస్త్రీయంగా లేదా వైద్యపరంగా నిరూపితమైతే.. ఈ అంశాన్ని మళ్లీ కోర్టు పరిశీలించవచ్చని స్పష్టం చేసింది.
అంతేకాదు, మరణశిక్ష అమలు విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని కోర్టు సూచించింది. ఇందులో వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు, న్యాయ నిపుణులు, న్యూరోసైన్స్ నిపుణులు తదితరులు ఉండొచ్చు.
అంటే.. ప్రస్తుతం ఉరిశిక్ష కొనసాగుతుంది. కానీ భవిష్యత్తులో తక్కువ నొప్పి, బాధతో మరణశిక్ష అమలు చేసే మెరుగైన పద్ధతి ఉందని రుజువైతే దానిపై చర్చకు సుప్రీంకోర్టు తలుపులు తెరిచి ఉంచింది.
Also Read: Nayanthara: నయనతార గుండు చేయించుకున్నారా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!
