TRAI: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త 1601 నంబర్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1600 నంబర్లు ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల కాల్స్‌కు ఉపయోగిస్తుండగా.. 1601ను డెలివరీ, విద్యుత్, నీరు, గ్యాస్, ఎల్పీజీ వంటి సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసం కేటాయించారు. ప్రమోషనల్ కాల్స్‌కు 1601ను ఉపయోగించకూడదు. దీంతో వినియోగదారులు కాల్ స్వభావాన్ని సులభంగా గుర్తించే అవకాశం ఉంది.
మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని కాల్స్ విషయంలో వినియోగదారుల్లో ఉండే ఆందోళనను తగ్గించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసం కొత్త 1601 నంబర్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు 1600 సిరీస్ నంబర్లను ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే ఈ నంబర్ల నుంచి రుణాలు, బీమా వంటి ప్రమోషనల్ కాల్స్ కూడా రావడంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో 1601 నంబర్‌ను ప్రత్యేక సేవలకు కేటాయించారు. కొరియర్, డెలివరీ సేవలతో పాటు విద్యుత్ బిల్లింగ్, నీటి సరఫరా, గ్యాస్, ఎల్పీజీ వంటి సేవలకు సంబంధించిన కాల్స్‌ను ఈ నంబర్ ద్వారా చేయవచ్చు. డెలివరీ ఏజెంట్లు కూడా వినియోగదారులను సంప్రదించేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించనున్నారు.
అయితే 1601 నంబర్‌ను ప్రమోషనల్ లేదా మార్కెటింగ్ కాల్స్ కోసం ఉపయోగించకూడదని TRAI స్పష్టం చేసింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్ల ద్వారా ఈ నంబర్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.
1600, 1601 నంబర్లకు వేర్వేరు ఉపయోగాలు ఉండటంతో వినియోగదారులు కాల్ ఎక్కడి నుంచి వస్తుందో, దాని ఉద్దేశం ఏమిటో సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ కాల్స్‌ను మోసపూరిత కాల్స్‌గా భావించి మిస్ చేసే పరిస్థితి తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అయితే రెండు నంబర్ సిరీస్‌లతో స్పామ్ కాల్స్ పూర్తిగా తగ్గుతాయని ఇప్పుడే చెప్పలేం. కానీ కాల్ స్వభావాన్ని గుర్తించడంలో ఈ విధానం వినియోగదారులకు కొంత స్పష్టత కల్పించే అవకాశం ఉంది.
Also Read: Tirupati: స్వాతంత్ర్య వేడుకల్లో షాక్.. ప్రసంగిస్తూ కిందపడిపోయిన మంత్రి!
