Tirupati: స్వాతంత్ర్య వేడుకల్లో షాక్.. ప్రసంగిస్తూ కిందపడిపోయిన మంత్రి!

Minister Falls Ill During Independence Day Celebrations in Tirupati

Tirupati: తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఆయనను సురక్షితంగా తరలించి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ముందస్తుగా అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు.

తిరుపతి(Tirupati) పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

ప్రసంగం మధ్యలో ఆయనకు అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంత్రిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

వీఆర్ హైస్కూలు పేరు ఎందుకు మార్చారు?: వేదికపైనే నిలదీసిన మంత్రి ఆనం |  Minister Anam angry over the renaming of VR College

అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందుగానే అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అంతకుముందు తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, వివిధ శాఖలకు చెందిన సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలు కొనసాగుతున్న సమయంలోనే మంత్రి అస్వస్థతకు గురికావడంతో అక్కడ కొంతసేపు ఆందోళన నెలకొంది.

Also Read: Rapido: రాపిడో బైక్‌ నుంచి దూకిన యువతి!