Super Comeback: ’ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’.. సినిమా ‘జెర్సీ(Jersy)’లోని ఈ డైలాగ్‌ను నిజ జీవితంలో ఓ టెకీ కమ్‌బ్యాక్ (Comeback) స్టోరీ గుర్తు చేస్తోంది. కెరీర్(Career)లో అనుకోని విరామం వచ్చినా, పట్టుదలతో ముందుకు సాగితే తిరిగి మంచి అవకాశాన్ని సాధించవచ్చని ఈ కథ చెబుతోంది. ఓ టెకీ సయాటికా(Siatica) సమస్య కారణంగా సుమారు ఐదు నెలల పాటు ఉద్యోగానికి దూరంగా ఉన్నాడు. తిరిగి కెరీర్‌ను ప్రారంభించేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా(Social Media)లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.
కెరీర్ గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించడం అతనికి చాలా కష్టంగా మారింది. ఉద్యోగం కోసం ఏకంగా 36 ఇంటర్వ్యూలకు(Interviews) హాజరయ్యాడు. ఒక్కో ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలు, తిరస్కరణలు, ఫలితాలు అతని సహనాన్ని మరింత పరీక్షించాయి. అయినప్పటికీ అతను ప్రయత్నాలను ఆపలేదు. తనలోని నైపుణ్యాలను(Skills) మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాడు.
ముఖ్యంగా ఉద్యోగ విరామాన్ని ఖాళీగా గడపకుండా Generative AI (GenAI)పై నేర్చుకోవడం ప్రారంభించినాని అతను చెప్పాడు. టెక్నాలజీ రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఇంటర్వ్యూలకు హాజరవుతూనే.. ప్రతి ప్రయత్నం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకున్నాడు.

చివరకు హైదరాబాద్‌లో రూ.30 లక్షల వార్షిక వేతనం (Rs.30 LPA)తో ఉద్యోగాన్ని సాధించినట్లు అతను చెప్పుకొచ్చాడు. ఉద్యోగం దొరకడానికి ముందు తాను హాజరైన 36 ఇంటర్వ్యూల జాబితాను కూడా పంచుకున్నాడు. ఇదే ఈ కథలో ఆసక్తికరమైన అంశంగా మారింది.
సాధారణంగా కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. ముఖ్యంగా అనారోగ్యం లేదా వ్యక్తిగత కారణాలతో కొంతకాలం ఉద్యోగానికి దూరమైన తర్వాత తిరిగి మార్కెట్లోకి రావడం కష్టంగా అనిపించవచ్చు. అయితే ఈ టెకీ అనుభవం మాత్రం రిజెక్షన్స్(Rejections)ను ఎదుర్కొన్నప్పటికీ ప్రయత్నాలను కొనసాగించడం ఎంత ముఖ్యమో చెబుతోంది.
36 ఇంటర్వ్యూల తర్వాత వచ్చిన ఉద్యోగ అవకాశం, అంతకుముందు ఎదురైన ప్రతి తిరస్కరణకు సమాధానంగా నిలిచిందని చెప్పవచ్చు. కెరీర్లో బ్రేక్ వచ్చినంత మాత్రాన అవకాశాలు పూర్తిగా మూసుకుపోవని, కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ నిరంతరం ప్రయత్నిస్తే మంచి ఫలితం దక్కే అవకాశం ఉందని ఈ కమ్‌బ్యాక్ స్టోరీ సూచిస్తోంది.
అతను పంచుకున్న సందేశంలో ప్రధానంగా కనిపించేది ఒక్కటే. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని తిరస్కరణలు ఎదురైనా, ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. ఒక ఇంటర్వ్యూలో విఫలమవడం అంతిమ ఫలితం కాదు. తదుపరి అవకాశానికి అది ఒక అనుభవంగా ఉపయోగపడవచ్చు. ఈ నేపథ్యంలో సయాటికా సమస్య తర్వాత ఐదు నెలల విరామం తీసుకుని, 36 ఇంటర్వ్యూలను ఎదుర్కొని చివరకు హైదరాబాద్‌లో రూ.30 LPA ఉద్యోగాన్ని సాధించిన ఈ కథ సోషల్ మీడియాలో ఉద్యోగార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.
Also Read: Part Time Job: హైదరాబాద్ లో బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇవే..!
