Part Time Job: హైదరాబాద్ లో బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇవే..!

Part Time Jobs In Hyderabad

Part Time Job: హైదరాబాద్ లో ఉంటున్నారా.. ఎక్స్ ట్రా ఇన్ కమ్ లేదా పార్ట్ టైం జాబ్(Part Time Job) చేసి ఆర్థికంగా స్థిరపడాలనుకుంటున్నారా.. చదువుకుంటూనో, బిజినెస్ చేస్తూనో మరో పని చేస్తూ సంపాదించాలనుకుంటారా.. అయితే మీ కోసమే ఈ వార్త. హైదరాబాద్ ఇప్పుడు ఐటీ, బిజినెస్, ఎడ్యుకేషన్ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. చదువుకుంటూనే స్వతంత్రంగా జీవించాలనుకునే విద్యార్థులు, అదనపు ఆదాయం కోసం చూసే ఉద్యోగులు లేదా గృహిణులకు నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు (Part-time Jobs) పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. సరైన నైపుణ్యం, రోజుకు 3 నుండి 4 గంటల సమయం కేటాయిస్తే చాలు హైదరాబాద్‌లో మీరు నెలకు రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు సులభంగా సంపాదించవచ్చు. నగరంలో డిమాండ్ ఉన్న టాప్ పార్ట్ టైమ్ జాబ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

part time Jobs in Hyderabad

1. డెలివరీ పార్ట్‌నర్స్ (Delivery Partners)

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), జెప్టో (Zepto), బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్/గర్ల్‌గా చేరవచ్చు. మీకు కుదిరిన సమయం (Shift Flexibility) బట్టి సాయంత్రం వేళల్లో లేదా వీకెండ్స్‌లో పని చేయవచ్చు. వీటికి ద్విచక్ర వాహనం (Bike), స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఈజీగా పనిలో చేరిపోవచ్చు.

2. బైక్ టాక్సీ అండ్ రైడ్ షేరింగ్ (Bike Taxi Drivers)

ర్యాపిడో (Rapido), ఉబెర్ (Uber Moto), ఓలా బైక్ సర్వీసుల్లో పార్ట్ టైమ్ డ్రైవర్‌గా పని చేయడం వల్ల మంచి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ (పీక్ అవర్స్), కాలేజ్ వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

3. కస్టమర్ సపోర్ట్ & టెలీకాలర్ (Customer Support)

హైదరాబాద్‌లో ఉన్న అనేక స్టార్టప్‌లు, కాల్ సెంటర్లు, ఈ-కామర్స్ కంపెనీలు పార్ట్ టైమ్ టెలీకాలర్లు లేదా చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సాయంత్రం షిఫ్టుల్లో సులభంగా పని చేయవచ్చు.

jobs in hyderabad

4. హోమ్ ట్యూషన్స్ & ఆన్‌లైన్ టీచింగ్ (Home / Online Tutors)

మీకు నిర్దిష్ట సబ్జెక్టులపై (గణితం, సైన్స్, కోడింగ్) పట్టు ఉంటే, పాఠశాల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా మంచి పారితోషికం పొందవచ్చు. అమీర్‌పేట్, దిల్ సుఖ్ నగర్, కుకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో హోమ్ ట్యూషన్లకు బాగా డిమాండ్ ఉంది.

5. కంటెంట్ రైటింగ్ & డేటా ఎంట్రీ (Content Writing & Data Entry)

డిజిటల్ మీడియా విస్తరిస్తున్న ఈ రోజుల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఆర్టికల్స్ రాయడం లేదా డేటా ఎంట్రీ ప్రాజెక్ట్‌లు చేయడం ద్వారా ఇంట్లో ఉండే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిలో సంపాదించవచ్చు.

జాగ్రత్తలు:

హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ముందుగా డబ్బులు (Registration Fees/Security Deposit) అడిగే ఫేక్ ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిజమైన పార్ట్ టైమ్ జాబ్స్ ఎప్పుడూ ముందుగా డబ్బులు అడగవు. కావున ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తిరస్కరించడం ఉత్తమం. మీ ఆసక్తి, సమయానికి సరిపోయే పార్ట్ టైమ్ జాబ్‌ను ఎంచుకోవడం ద్వారా ఆర్థిక స్వతంత్రత సాధించడమే కాకుండా మంచి అనుభవాన్ని పొందవచ్చు.

Also Read: Human Body After Death: మనిషి చనిపోయిన మొదటి గంటలో శరీరంలో ఏం జరుగుతుంది?