Lizard Dreams: కలలో బల్లి వస్తే ఏమవుతుంది? కీడుకు సంకేతమా?

Lizard Dreams: Hidden Meanings You Should Know

Lizard Dreams: రాత్రి పడుకున్నప్పుడు కలలో బల్లి(Lizard Dreams) కనిపించిందా? చాలామంది ఉలిక్కిపడి లేస్తారు. “అమ్మో బల్లి వచ్చింది, ఏదైనా కీడు జరుగుతుందా?” అని టెన్షన్ పడతారు. అసలు స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో, నిజంగా భయపడాల్సిన అవసరం ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.

1. ఇంటి గోడపై బల్లి కనిపిస్తే

కలలో మీ ఇంటి గోడపై బల్లి తిరుగుతున్నట్లు వస్తే, ఇంట్లో ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. ఎవరో చుట్టాలు రావడం, ఇంట్లో చిన్న ఫంక్షన్ జరగడం లాంటివి జరగచ్చు. ఇంటి విషయాలపై కాస్త శ్రద్ధ పెట్టమని కూడా దీని అర్థం.

MEANING OF SEEING WALL GECKO IN THE DREAM (ka malinso ka mung'anda)  Wallgecko is a symbol of èvil. To see gecko in your dream, it means you  have close enemies1 trying to

2. బల్లి మీ మీదకు వస్తున్నట్లు వస్తే

బల్లి మీ వైపు పాకుతున్నట్లు కల వస్తే భయపడకండి. త్వరలో మీకు కొత్త పరిచయం కానీ, కొత్త ఉద్యోగ అవకాశం కానీ రాబోతుందని సంకేతం. కానీ ఏది చేసినా కాస్త ఆలోచించి చేయండి.

3. బల్లి పారిపోతున్నట్లు వస్తే

ఇది అయితే సూపర్ కల! మిమ్మల్ని చాలా రోజులుగా వేధిస్తున్న సమస్య, అప్పు, లేదా శత్రువు త్వరలో మీ లైఫ్ నుండి పారిపోతాడని అర్థం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవచ్చు.

4. బల్లి కరిచినట్లు కల వస్తే

ఇది మాత్రం కాస్త హెచ్చరిక లాంటిది. ఆఫీసులో, బిజినెస్ లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో, కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి సంతకాలు పెట్టకండి.

MEANING OF SEEING WALL GECKO IN THE DREAM (ka malinso ka mung'anda) Wallgecko is a symbol of èvil. To see gecko in your dream, it means you have close enemies1 trying to

5. చనిపోయిన బల్లి కనిపిస్తే

పాత బాధలన్నీ పోయి కొత్త జీవితం మొదలవుతుందని దీని అర్థం. మీకున్న అప్పులు, గొడవలు అన్నీ క్లీన్ అయిపోయి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు.

అసలు సైన్స్ ఏం చెబుతోంది?

నిజం చెప్పాలంటే, మనం పగలు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో, లేదా ఎక్కువగా దేన్ని చూస్తామో అవే రాత్రి కలలోకి వస్తాయి. పగలు బల్లిని చూసి భయపడితే రాత్రి కలలోకి వచ్చేస్తుంది. దీనికి భవిష్యత్తుకు సంబంధం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఫైనల్ గా ఒక్క మాటలో…

కలలో బల్లి వస్తే భయపడాల్సిన అవసరం లేదు. మంచి కల అయితే హ్యాపీగా ఫీల్ అవ్వండి, చెడ్డ కల అయితే “ఓహో జాగ్రత్తగా ఉండాలి” అని అనుకోండి. కలలను బట్టి లైఫ్ లో పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోకండి!

Also Read: Moon Temperature: చంద్రుడిపై ఎండ ఉంటుందా? షాకింగ్ ఫ్యాక్ట్స్!