APK ఫైల్స్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి?
-
బ్యాంకింగ్ సమాచారం చోరీ: హ్యాకర్లు సాధారణ యాప్‌లలో మాల్వేర్ (Malware) లేదా ట్రోజన్‌లను (Trojans) దాచి ఉంచుతారు. మీరు ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసిన వెంటనే, అవి మీ SMS అనుమతులను పొంది బ్యాంకింగ్ OTPలను సైలెంట్‌గా హ్యాకర్లకు చేరవేస్తాయి.
-
స్పైవేర్, ప్రైవసీకి భంగం: కొన్ని మోడెడ్ యాప్‌లు మీ కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్స్, గ్యాలరీని సీక్రెట్ గా యాక్సెస్ చేసి మీ ఫోటోలు, వీడియోలను డార్క్ వెబ్‌కి చేరవేస్తాయి.
-
ఫోన్ వేగం తగ్గడం: హ్యాకింగ్ కోడ్ నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం వల్ల ఫోన్ వేగంగా వేడెక్కడమే కాకుండా, బ్యాటరీ, మొబైల్ డేటా కూడా త్వరగా అయిపోతాయి.

మీ ఫోన్ హ్యాక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
-
VirusTotal తో ఫైల్ స్కాన్ చేయండి: ఏదేని కొత్త APK ఫైల్‌ను ఫోన్‌లో ఇన్స్టాల్ చేసే ముందు, బ్రౌజర్‌లో VirusTotal.com ఓపెన్ చేసి ఆ APK ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. ఇది 70 కంటే ఎక్కువ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లతో ఆ ఫైల్‌ని స్కాన్ చేసి, అందులో మాల్వేర్ ఉందో లేదో క్షణాల్లో చూపిస్తుంది.
-
Google Play Protect ఆన్ ఉంచండి: ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి Play Protect సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. “Scan apps with Play Protect” ని ఎల్లప్పుడూ ఆన్ మోడ్‌లో ఉంచండి. ఇది ప్రమాదకర యాప్‌లను గుర్తించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
-
యాప్ పర్మిషన్లు పరిశీలించండి: యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత కెమెరా, కాంటాక్ట్స్, SMS వంటి క్రిటికల్ పర్మిషన్లు అడిగితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉదాహరణకు, ఒక ఆఫ్‌లైన్ గేమ్‌కి SMS లేదా లొకేషన్ పర్మిషన్ అవసరం లేదు.
-
‘Unknown Sources’ ని ఆఫ్ చేయండి: యాప్ ఇన్స్టాల్ చేయడం పూర్తయిన వెంటనే, మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని “Install Unknown Apps” ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి.
ముఖ్యంగా చెప్పాలంటే GB WhatsApp, ఫ్రీ OTT మోడ్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వీలైనంత వరకు అధికారిక ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. ఫలితంగా మీ డిజిటల్ ప్రైవసీని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Also Read: Make Money Online: ChatGPT, Canva ద్వారా ఆన్‌లైన్‌లో నెలకు రూ.30,000 ఎలా సంపాదించాలి?
