PM Awas Yojana: సొంతిల్లు అనేది చాలా మందికి ఓ ఎమోషనల్ డ్రీమ్. కొన్నిసార్లు దాని కోసం జీవితాంతం కష్టపడ్డా నెరవేర్చుకోలేరు. అద్దె కొంపల్లో ఇమడలేక, ఆర్థిక భారంతో సతమవుతూ సొంతింటి కోసం పరితపిస్తున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి వారి కల నెరవేర్చేందుకు కేంద్రం తీసుకువచ్చిన పథకమే PM ఆవాస్ యోజన (PM Awas Yojana). ఆర్థికంగా వెనుకబడిన, పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడానికి ఈ అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు సబ్సిడీ ధరకు ఇళ్లు లేదా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.

పథకానికి అర్హతలు (Eligibility):
-
దరఖాస్తుదారు పేరు మీద లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీద దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు.
-
గతంలో ప్రభుత్వం నుండి ఎలాంటి గృహనిర్మాణ పథకం లబ్ధి పొంది ఉండకూడదు.
-
కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి (EWS, LIG, MIG కేటగిరీల ప్రకారం) లోపు ఉండాలి.
-
దరఖాస్తుదారు వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు క్రియాశీల బ్యాంక్ ఖాతా ఉండాలి.
PM Awas Yojana కి ఎలా అప్లై చేయాలి? (Application Process)
ఈ పథకానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు:
1. ఆన్లైన్ విధానం (Online Process):
-
ముందుగా PM Awas Yojana అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
-
హోమ్‌పేజీలో Citizen Assessment ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ వర్గాన్ని (In Situ Slum Rediscovery లేదా Benefit under other 3 components) ఎంచుకోవాలి.
-
మీ ఆధార్ నంబర్ నమోదు చేసి వెరిఫై చేయాలి.
-
ఆధార్ వెరిఫై అయిన తర్వాత ఒక దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, బ్యాంక్ ఖాతా, కుటుంబ ఆదాయ వివరాలు సరిగ్గా పూరించాలి.
-
అన్ని వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత ఒక Application ID వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
2. ఆఫ్‌లైన్ విధానం (Offline Process):
-
ఆన్లైన్ సదుపాయం లేని వారు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
-
లేదా మీ పరిధిలోని గ్రామ సచివాలయం / వార్డు సచివాలయం లేదా మున్సిపల్ ఆఫీస్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలు (ఆధార్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్) అందించి దరఖాస్తు చేసుకోవచ్చు.
సొంత ఇల్లు లేని పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సరిగ్గా అప్లై చేయడం ద్వారా PM ఆవాస్ యోజన కింద ఇల్లు లేదా ఆర్థిక సాయం పొందవచ్చు.
Also Read:Telugu Actresses: హిందీ రాకపోయినా.. బాలీవుడ్లో జెండా పాతేసిన తెలుగు నటీమణులు!
