Viral: ప్రాణాల కంటే కొడుకు చదువే ముఖ్యం.. భీకర వరదల్లో తండ్రి చేసిన సాహసం చూస్తే కన్నీళ్లు ఆగవు!

Viral: Father Risks Life, Carries Son On Shoulders

Viral: తండ్రి ప్రేమకు, కొడుకు చదువుపై ఉన్న తపనకు అద్దం పట్టే ఓ అద్భుతమైన సంఘటన సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌(Viral)గా మారింది. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిహార్‌లోని నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో బగాహా ప్రాంతంలో ఉన్న మసాన్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

కానీ, వరద ప్రవాహం కొడుకు చదువుకు అడ్డుకాకూడదని భావించాడు ఆ తండ్రి. సమయానికి పాఠశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో, తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని, ప్రాణాలకు తెగించి ఆ భీకరమైన నదిని దాటాడు. మోకాళ్ల లోతు కంటే ఎక్కువ ఉన్న ఉధృత ప్రవాహంలో, ఏ చిన్న పొరపాటు జరిగినా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి. అయినా సరే, అడుగు తప్పకుండా కొడుకును సురక్షితంగా నది దాటించి స్కూల్‌కు పంపాడు.

Video:बेटे की पढ़ाई के लिए जान पर खेल गया पिता, कंधे पर बैठाकर पार कराया उफनती नदी, वायरल हुआ वीडियो - Father Carrying Son Across River On Shoulder To Make Him Reach

కళ్లు తెరిపించే చేదు నిజం: ఈ వీడియో ఒక పక్క తండ్రి సాహసానికి ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, మరోపక్క అక్కడి దారుణమైన పరిస్థితులను ఎత్తిచూపుతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, నేటికీ ఆ గ్రామంలో కనీస మౌలిక వసతులు, ఒక వంతెన (Bridge) కూడా లేకపోవడం గమనార్హం. చదువుకోవడానికి పిల్లలు ప్రతిరోజూ ఇలా ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: Hydrogen Trains: బొగ్గు, డీజిల్ అవసరం లేదు.. ఒక్కసారి ట్యాంక్ నింపితే 1000 కి.మీ.