Vijay Verma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ లైఫ్ లోకి కొత్త అమ్మాయి?

New girl in Vijay Varma’s life_ Meet Aaliya Qureshi

New girl in Vijay Varma’s life_ Meet Aaliya Qureshi

Vijay Verma: సినీ పరిశ్రమలో ప్రేమలు, బ్రేకప్‌లు సాధారణమే. కానీ కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులకు అంగీకరించడం కష్టం. అలాంటి జంటల్లో విజయ్ వర్మ – తమన్నా భాటియా ఒకటి. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా వీరి బ్రేకప్ వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇద్దరూ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో తమ సంబంధాన్ని పరోక్షంగా అంగీకరించారు. కానీ 2025 ప్రారంభం నుంచి వీరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలే ఈ విడిపోవడానికి కారణమని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. తమన్నా తన సోషల్ మీడియాలో విజయ్‌తో ఉన్న ఫోటోలను తొలగించడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. చివరకు 2025 మార్చి నాటికి వీరిద్దరూ అధికారికంగా విడిపోయినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, తమన్నాతో బ్రేకప్ అయిన కొద్ది కాలానికే విజయ్ వర్మ మరో నటి అలియా ఖురేషితో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ముంబైలో వీరిద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకే కారులో వెళ్లడం, కలిసి బయటకు రావడం వంటి దృశ్యాలు నెటిజన్లలో కొత్త అనుమానాలకు దారితీశాయి.

గతంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ప్రస్తుతం అలియా ఖురేషితో ఆయనకు కొత్త రిలేషన్‌షిప్ మొదలైందా? అనే చర్చలు సాగుతున్నాయి. ‘మట్కా కింగ్’ అనే సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం కూడా గమనార్హం. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం మరింత దగ్గరైందనే ప్రచారం జరుగుతోంది.

అలియా ఖురేషి బాలీవుడ్‌లో ఎదుగుతున్న యువ నటి. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో ‘జాన్వి’ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటిగానే కాకుండా గాయని, సాంగ్ రైటర్‌గా కూడా ప్రతిభ చూపుతోంది. వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.

ప్రస్తుతం విజయ్ వర్మ, అలియా ఖురేషి డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగానే కొత్త ప్రేమ కథ ప్రారంభమైందా అన్నది తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Also Read: Personal Finance: మీ డబ్బులన్నీ ఒకే బ్యాంకులో ఉన్నాయా.. ఐతే రిస్క్‌ తప్పదు

Vijay Verma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ లైఫ్ లోకి కొత్త అమ్మాయి?