Ear Piercing Tips: పిల్లలు పుట్టి పెరిగే సమయంలో అనేక సాంప్రదాయాలు పాటిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చెవులు కుట్టించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది తరతరాలుగా కొనసాగుతున్నప్పటికీ, దీనికి సరైన వయసు మరియు జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరం.
ఏ వయసులో చెవులు కుట్టించాలి?
కొంతమంది పిల్లలు పుట్టిన ఆరు నెలల్లోనే చెవులు కుట్టిస్తారు. అయితే ఇది అంత మంచిది కాదు. ఆ సమయంలో పిల్లల ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే 6 నెలలు దాటిన తర్వాత, అవసరమైన టీకాలు వేయించి, సుమారు 10 నెలల వయసు వచ్చిన తర్వాత చెవులు కుట్టించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది
పిల్లల ఆరోగ్యంపై డాక్టర్లకు పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి చెవులు కుట్టించే ముందు వారి సలహా తీసుకోవడం ఉత్తమం. వారు సరైన పద్ధతులు, జాగ్రత్తలు సూచిస్తారు.
కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెవులు కుట్టేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. గ్లౌజ్‌లు తప్పనిసరిగా వాడాలి. ఉపయోగించే పరికరాలు శుభ్రంగా, స్టెరిలైజ్ చేసి ఉండాలి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉండటం మంచిది.
సరైన స్థానం ఎంపిక
చెవులు కుట్టేటప్పుడు సరైన ప్రదేశంలోనే కుట్టాలి. తప్పు స్థలంలో కుట్టితే నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకు పొడవైన జుట్టు ఉంటే దాన్ని పైకి కట్టడం మంచిది. అలాగే ఆ సమయంలో హెయిర్ స్ప్రేలు, జెల్స్, పెర్ఫ్యూమ్స్ వాడకూడదు.
కుట్టిన తర్వాత జాగ్రత్తలు
చెవులు కుట్టిన తర్వాత గాయం పూర్తిగా మానేవరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలను ఎక్కువగా ఆడనివ్వకుండా చూడాలి. బయటకు తీసుకెళ్లడాన్ని తగ్గించడం మంచిది. అలాగే పిల్లలను ఎత్తుకునేటప్పుడు గాయం దగ్గర తగలకుండా జాగ్రత్తపడాలి.
ఈ విధంగా సరైన వయసులో, సరైన జాగ్రత్తలతో చెవులు కుట్టిస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది.
Also Read: WhatsApp Tricks: వాట్సాప్ 90% మందికి తెలియని సీక్రెట్ ట్రిక్స్
Ear Piercing Tips: చిన్నపిల్లలకి ఏ వయసులో చెవులు కుట్టించాలంటే..
