Ugadi 2026: తెలుగు పంచాంగంలో మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. కానీ ఆ సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి అన్న విషయం మాత్రం అందరికీ తెలియదు. ఈ పేర్ల వెనుక ఒక పురాణ కథ ఉంది.
ఒకసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోయారని చెబుతారు. ఆ తర్వాత ఒక రాజును వివాహం చేసుకుని గృహస్థ జీవితం గడిపారు. వారికి మొత్తం 60 మంది కుమారులు జన్మించారు. కొంతకాలం తర్వాత ఆ రాజు తన కుమారులతో కలిసి యుద్ధానికి వెళ్లగా, ఆ యుద్ధంలో అందరూ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన నారదుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఆయన భక్తికి కరుణించిన విష్ణువు, “నీకు జన్మించిన ఆ 60 మంది కుమారులు కాలచక్రంలో 60 సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటారు” అని వరం ఇచ్చాడని పురాణం చెబుతుంది. అలా ఆ 60 మంది కుమారుల పేర్లే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న తెలుగు సంవత్సరాల పేర్లుగా మారాయి.
ఆ 60 సంవత్సరాల పేర్లు వరుసగా ఇవి:
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాథి, విక్రయ, వృక్ష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవలంభి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.
ఈ విధంగా తెలుగు సంవత్సరాల చక్రం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. ఇది మన భారతీయ కాల గణనలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంప్రదాయం.
