Shocking Twist: 17ఏళ్ల బాలికకు గర్భం.. పెళ్లికి నో చెప్పిన బాలుడి కుటుంబం

Shocking Twist: minor girl pregnancy in kankipadu

Shocking Twist: ప్రేమ పేరుతో దగ్గరైన ఇద్దరు మైనర్ల జీవితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఏడు నెలల గర్భంతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని ఓ తల్లి వేడుకుంటోంది. తమ కుమార్తె జీవితాన్ని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. క-ృష్ణా జిల్లా కంభంపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు 17 ఏళ్లు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు సమాచారం. ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి..

బాలిక గర్భం దాల్చిన విషయం కుటుంబ సభ్యులు, బంధువుల దృష్టికి తీసుకెళ్లారు. బాలుడితో పెళ్లి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని ఇరు కుటుంబాల పెద్దలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాలుడు కూడా మొదట బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఇరు కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పెళ్లికి అంగీకారం లభిస్తుందని భావించారు.

అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బాలుడి కుటుంబం పెళ్లికి వెనుకడుగు వేసినట్లు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి విషయంలో పలు కారణాలు చెబుతూ బాలుడి కుటుంబం ముందుకు రాలేదని తెలిపారు. దీంతో బాలిక తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై అధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

Minor Girl Pregnancy: 16 వారాల గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి:  కోర్టులో 14 ఏళ్ల బాలిక పిటిషన్‌ | Minor Girl Moves Delhi High Court For  Medical Termination Of 16 Week Pregnancy at ...

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి

బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. బాలిక వయస్సు 18 ఏళ్లలోపే ఉండటంతో ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బాలికకు రక్షణ కల్పించడంతో పాటు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరూ మైనర్లే

ఈ ఘటనలో బాలుడు, బాలిక ఇద్దరూ మైనర్లే కావడంతో చట్టపరమైన అంశాలు కూడా కీలకంగా మారాయి. బాల్య వివాహం, మైనర్లతో సంబంధం ఉన్న చట్టాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాలిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

నా కూతురికి న్యాయం చేయండి: తల్లి

“అసలే బలహీనంగా ఉన్న నా కుమార్తె ఈ పరిస్థితుల్లో మనోవేదనకు గురవుతోంది. బాలిక సంరక్షణ కేంద్రంలోనే ఉంటున్న బాలుడి కుటుంబం ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తన కుమార్తెకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని” బాలిక తల్లి అధికారులను కోరుతున్నట్లు సమాచారం.

మైనర్లకు సంబంధించిన ఇలాంటి వ్యవహారాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

Also Read: Papaya During Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందా?