BIG BREAKING ఫర్నిచర్ షాపుల్లో భారీ ప్రమాదం

Hyderabad: Massive #fire breaks out in #Bachupally

Hyderabad: Massive #fire breaks out in #Bachupally

BIG BREAKING హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రగతినగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈ ఘటన జరిగింది. అక్కడ కమాన్ సమీపంలో వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో ఒక దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.

మొదట ఒక షాపులో ప్రారంభమైన మంటలు కొద్ది సేపటికే పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా అంటుకున్నాయి. షాపుల్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్ సామగ్రి మంటలకు ఆహుతి కావడంతో అగ్ని మరింత ఉద్ధృతంగా మారింది. రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Mobile: కేవలం అందుకోసమే.. గంటకు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు

BIG BREAKING ఫర్నిచర్ షాపుల్లో భారీ ప్రమాదం