Pratyusha: రేప్ చేసి, మర్డర్.. 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

Actor Pratyusha Death Case: Supreme Court Asks Siddharth Reddy To Surrender In Four Weeks

Actor Pratyusha Death Case: Supreme Court Asks Siddharth Reddy To Surrender In Four Weeks

Pratyusha: సినీ నటి ప్రత్యూష పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, 90ల కాలంలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు ఉండేది. కొద్ది సినిమాలే చేసినా అప్పటి యువత గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. హీరోయిన్‌గా కెరీర్ బాగా సాగుతున్న సమయంలో జరిగిన ఆమె ఆకస్మిక మరణం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. 2002లో చోటుచేసుకున్న ప్రత్యూష మరణ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ కేసు దాదాపు 24 సంవత్సరాలుగా విచారణలో ఉండగా, మంగళవారం (ఫిబ్రవరి 17) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించడంతో విషయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

ప్రత్యూష మరణానికి సంబంధించిన వివరాలు:
హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రత్యూష తన ఇంటర్మీడియట్ స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడగా, ప్రత్యూష మరణించింది. అనంతరం ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సిద్ధార్థ్ రెడ్డికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత 2011లో ఈ శిక్షను హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది.

ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి, ఇది ఆత్మహత్య కాదని, పన్నాగపూర్వక హత్య అని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీర్ఘకాల విచారణ అనంతరం సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. అలాగే సిద్ధార్థ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి, నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

ప్రత్యూష సినీ ప్రస్థానం:
ప్రత్యూష బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి, తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది. “కలుసుకోవాలని”, “రాయుడు”, “సముద్రం” వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలో జరిగిన ఆమె మరణం కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది.

Also Read: Odisha: 150కి 20 మార్కులొచ్చినా టీచర్ జాబ్.. విమర్శలు

Pratyusha: రేప్ చేసి, మర్డర్.. 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..