Tech News: మీ ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్‌ పాటించండి!

Laptop charging mistakes you must avoid_ These 5 habits can damage your device

Laptop charging mistakes you must avoid_ These 5 habits can damage your device

Tech News: ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లపై ఆధారపడుతున్నారు. సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి వినోదానికి కూడా ఇవే ప్రధాన సాధనంగా మారాయి. అయితే చాలా మందిని వేధించే ప్రధాన సమస్య బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. కొత్త ల్యాప్‌టాప్‌ల్లో కూడా మొదట 3–4 గంటలు బ్యాటరీ ఉండగా, కొంతకాలం తర్వాత అది తగ్గిపోతుంది.

ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువసేపు నిలవాలంటే కొన్ని సరళమైన చిట్కాలు పాటించడం అవసరం. ముందుగా పవర్ సెట్టింగ్స్‌ను సరిచేయాలి. విండోస్‌లో పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేస్తే, స్క్రీన్ త్వరగా ఆఫ్ అవడం, స్లీప్ మోడ్‌కు వెళ్లడం వంటి ఫీచర్ల ద్వారా బ్యాటరీ సేవ్ అవుతుంది. టాస్క్‌బార్‌లోని బ్యాటరీ ఐకాన్ ద్వారా ఈ సెట్టింగ్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

స్క్రీన్ బ్రైట్‌నెస్ కూడా బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ బ్రైట్‌నెస్ పెడితే బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అందుకే అవసరానికి తగ్గట్టుగా బ్రైట్‌నెస్ తగ్గించుకోవడం మంచిది.

వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అవసరం లేనప్పుడు ఆఫ్‌లో ఉంచాలి. ఇవి బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తాయి. అలాగే మౌస్, ఎక్స్‌టర్నల్ కీబోర్డ్, హార్డ్‌డ్రైవ్, యూఎస్‌బీ వంటి పరికరాలను ఉపయోగం అయిపోయిన వెంటనే తొలగించడం మంచిది.

చార్జింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి ఉండకుండా, 20 శాతం వద్దే చార్జ్ పెట్టడం మంచిది. అలాగే 100 శాతం చార్జ్ అయిన తర్వాత వెంటనే ప్లగ్ తీసేయాలి. ఎక్కువసేపు ఛార్జర్‌కు కనెక్ట్ చేసి వాడటం బ్యాటరీ జీవితాన్ని తగ్గిస్తుంది.

ఇంకా, అవసరం లేని ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను ఆఫ్ చేయడం ద్వారా కూడా బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు.

Also Read: AC Usage: రోజుకు 8-10 గంటలు ఏసీ వాడుతున్నారా.. ఎంత కరెంట్ ఖర్చవుతుందంటే.. 

Tech News: మీ ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్‌ పాటించండి!