Fraudulent Loans: టెక్నాలజీ ఏ రేంజ్ లో పెరుగుతుందో.. అంతకు వంద రెట్టు మోసాలూ పెరుగుతున్నాయి. కొన్ని సార్లు వాటిని అంచనా వేయడం కూడా కష్టమే. నేడు బ్యాంకు ఖాతాలు తెరవడం నుండి మొబైల్ సిమ్ కార్డ్, రుణాలు పొందే వరకు ప్రతీదానికీ ఆధార్ కార్డ్ (Aadhaar Card) ముఖ్యమైన ఆధారం. అందుకే సైబర్ నేరగాళ్ళు లేదా మోసగాళ్ళు దాన్నే ఆసరాగా తీసుకుంటున్నారు. ఇతరుల ఆధార్ నంబర్, పాన్ కార్డ్ వివరాలను దొంగిలించి, వారి ప్రమేయం లేకుండానే డిజిటల్ లోన్ యాప్‌లు లేదా ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు(Fraudulent Loans) తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి రోజుల్లో మరింత ఎక్కువవుతున్నాయి. అలా మీ పేరు మీద కూడా ఎవరైనా మీకు తెలియకుండా లోన్ తీసుకున్నారేమో తెలుసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి.. అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ (CIBIL Report) ద్వారా..
ఆధార్ కార్డ్‌తో మీ పేరు మీద ఏవైనా యాక్టివ్ రుణాలు (Active Loans) ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అత్యంత తేలికైన, సురక్షితమైన మార్గం క్రెడిట్ రిపోర్ట్ (CIBIL/Experian Report) చెక్ చేయడం.
-
క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్లు: CIBIL, Experian, Equifax, High Mark వంటి అధికారిక క్రెడిట్ బ్యూరో సైట్లలో ఉచితంగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పొందవచ్చు.
-
ఫిన్‌టెక్ యాప్‌లు: Google Pay, Paytm, PhonePe, Policybazaar వంటి యాప్‌ల ద్వారా ఉచితంగా మీ సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.
చెక్ చేసే విధానం (Step-by-Step Process):
-
స్టెప్ 1: పైన పేర్కొన్న ఏదైనా సురక్షితమైన యాప్‌ను ఓపెన్ చేసి “Check CIBIL / Credit Score” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
-
స్టెప్ 2: మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
-
స్టెప్ 3: మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా వెరిఫై చేయండి.
-
స్టెప్ 4: మీ క్రెడిట్ రిపోర్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో “Active Accounts” లేదా “Loan Accounts” అనే విభాగంపై క్లిక్ చేయండి.
-
స్టెప్ 5: అక్కడ మీ పేరుపై ప్రస్తుతం నడుస్తున్న క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్ల లిస్ట్ కనిపిస్తుంది.
![]()
మీ ప్రమేయం లేకుండా లోన్ ఉంటే ఏం చేయాలి?
ఒకవేళ మీరు తీసుకోని లోన్ లేదా మీకు తెలియని బ్యాంక్ ఆకౌంట్ ఏదైనా మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తే వెంటనే కింద పేర్కొన్న చర్యలు తీసుకోండి:
-
క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు (Raise a Dispute): సంబంధిత సిబిల్/ఎక్స్‌పీరియన్ వెబ్‌సైట్‌లో ‘Dispute’ ఆప్షన్ ద్వారా ఆ లోన్ మీది కాదని ఫిర్యాదు నమోదు చేయండి.
-
ఆ బ్యాంక్/ఫైనాన్స్ సంస్థను సంప్రదించండి: ఏ బ్యాంకు లేదా లోన్ యాప్ ద్వారా ఆ రుణం మంజూరైందో సదరు సంస్థ కస్టమర్ కేర్‌ను లేదా బ్రాంచ్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వండి.
-
సైబర్ క్రైమ్ ఫిర్యాదు: సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in) లో లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఐడెంటిటీ థెఫ్ట్ (Identity Theft) కింద ఫిర్యాదు చేయండి.
మన వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ప్రతి 3 లేదా 6 నెలలకొకసారి సిబిల్/క్రెడిట్ రిపోర్ట్‌ను ఉచితంగా చెక్ చేసుకోవడం మంచి అలవాటు. అలాగే మీ ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ ప్రతులను ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. అప్రమత్తంగా ఉంటే ఆర్థిక మోసాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Also Read: Used Laptop: సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి చెక్ చేయకుండా కొనొద్దు
