Viral: రికార్డ్ బ్రేకింగ్ స్మైల్.. అవును ఇతనికి 42 పళ్లు మరి..!

Man with the most teeth in the world flashes his record-breaking smile

Man with the most teeth in the world flashes his record-breaking smile

Viral: మలేషియాకు చెందిన ప్రతాబ్ మునియాండి తన ప్రత్యేకమైన చిరునవ్వుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కారణం ఆయన నోటిలో ఉన్న పళ్ల సంఖ్య. సాధారణంగా ఒక మనిషికి 32 పళ్లు ఉంటాయి. కానీ ప్రతాబ్‌కు మాత్రం మొత్తం 42 పళ్లు ఉన్నాయి. అంటే సాధారణ వ్యక్తితో పోలిస్తే ఆయనకు 10 పళ్లు ఎక్కువ. దీంతో ఒక వ్యక్తి నోటిలో అత్యధిక పళ్లు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదు అయింది.

Prathab pointing to his teeth

ప్రస్తుతం 33 ఏళ్ల వయసున్న ప్రతాబ్ చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2021లో కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతూ మాట్లాడుతున్న సమయంలో తన నోటిలో పళ్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన గమనించారు. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ కలిసి లెక్కించారు. అప్పటికి ఆయనకు 38 పళ్లు ఉన్నట్లు తెలిసింది.

Prathab showing off his extra teeth

తర్వాత దంత వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు. ఎక్స్‌రేలు తీసినప్పుడు ఇంకా నాలుగు పళ్లు బయటకు రాకుండా లోపలే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అనంతరం 2023లో ఇద్దరు డెంటిస్టులు పూర్తిగా పరిశీలించి ఆయనకు మొత్తం 42 పళ్లు ఉన్నట్లు ధృవీకరించారు. దీంతో ప్రతాబ్ ప్రపంచ రికార్డు సాధించారు.

x-ray of the man's teeth

ప్రతాబ్ చెప్పిన ప్రకారం, చాలా మంది ఆయనకు అదనపు పళ్లు ఉన్నాయని ఆయన చూపించే వరకు గుర్తించరట. తాను చెప్పినప్పుడు మాత్రం చాలా మంది ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఒక వ్యక్తికి సాధారణంగా 32 పళ్లు ఉంటాయని తెలిసినప్పుడు, తనకు 42 పళ్లు ఉన్నాయని తెలుసుకుని చాలామంది నమ్మలేకపోతారని తెలిపారు.

Prathab with his mouth open

అదే సమయంలో తన అదనపు పళ్లు తన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని ప్రతాబ్ చెప్పారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయడం ద్వారా నోటి పరిశుభ్రతను కాపాడుకుంటున్నానని తెలిపారు.

Prathab with his wife and son

ప్రపంచంలో అత్యధిక పళ్లు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని ప్రతాబ్ మునియాండి ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

Viral: రికార్డ్ బ్రేకింగ్ స్మైల్.. అవును ఇతనికి 42 పళ్లు మరి..!