Youtube: ప్రపంచంలో అత్యంత పెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ మంగళవారం రాత్రి నుంచి సాంకేతిక అంతరాయాలను ఎదుర్కొంది. ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యూజర్లు యూట్యూబ్ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ను సరిగా ఉపయోగించలేక ఇబ్బందులు పడ్డారు. వీడియోలు ప్లే కాకపోవడం, సెర్చ్ ఫలితాలు కనిపించకపోవడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొన్నారు.
అవుటేజ్‌ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, ఈ అంతరాయం మొదట అమెరికాలో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో (EST) ప్రారంభమైంది. అక్కడ ఒక్కసారిగా 3 లక్షల 20 వేలకుపైగా వినియోగదారులు సమస్యలను రిపోర్ట్ చేసినట్లు వెల్లడైంది. తర్వాత కొద్దిసేపటికే ఈ ప్రభావం ఇతర దేశాలకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది.
భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం వరకు DownDetectorలో 18 వేలకుపైగా భారతీయ యూజర్లు యూట్యూబ్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. కొందరికి వీడియోలు ఓపెన్ కాకపోగా, మరికొందరికి యాప్ లో సెర్చ్ చేసినా ఫలితాలు కనిపించలేదని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ అవుటేజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ సమస్యకు ఖచ్చితమైన కారణం ఏమిటి, ఎప్పటికి పూర్తిగా సరిచేస్తారు అనే విషయంపై గూగుల్ లేదా యూట్యూబ్ సంస్థలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే టెక్నికల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో ప్రారంభమైన సర్వర్ సంబంధిత లోపం ప్రపంచవ్యాప్తంగా సేవలపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: Actresses: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు వీళ్లే..!
Youtube: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన యూట్యూబ్
