Court: అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

Even Storage Of Child Pornographic Content Can Attract Offence U/S 15 POCSO Act: Karnataka High Court

Even Storage Of Child Pornographic Content Can Attract Offence U/S 15 POCSO Act: Karnataka High Court

Court: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి అశ్లీల వీడియోలు లేదా ఫోటోలు ఇతరులకు షేర్ చేయకపోయినా, వాటిని మొబైల్ ఫోన్‌లో నిల్వ ఉంచుకోవడం కూడా నేరమేనని స్పష్టం చేసింది.

కోర్టు ప్రకారం, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు లేదా చిత్రాలు ఫోన్‌లో స్టోర్ చేసి ఉంచడం కూడా చట్టవిరుద్ధం. ఇటువంటి కంటెంట్‌ను కలిగి ఉండటం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67B మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుందని హైకోర్టు తెలిపింది.

ఈ అంశంపై దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన మొబైల్‌లో అశ్లీల వీడియోలు సేవ్ చేసుకున్నందుకు తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

అయితే ఆ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు అలాంటి కంటెంట్‌ను ఫోన్‌లో ఉంచుకోవడం కూడా నేరమే అని స్పష్టం చేస్తూ, ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Also Read: Tamil Nadu: ఎన్నికల వేళ.. విజయ్‌కి బిగ్ షాక్

Court: అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు