Firest Night: ఫస్ట్ నైట్ రోజున మల్లెపూలను ఉపయోగించే ఆచారం చాలాకాలంగా కొనసాగుతుంది. మల్లెపూల సువాసన మనసును ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మార్చే గుణం కలిగి ఉంటుంది. కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న వధూవరులు ఆనందంగా, సుఖంగా గడపాలన్న ఉద్దేశ్యంతో మల్లెపూలను అలంకరణలో భాగం చేస్తారు.
మల్లెపూల పరిమళం ఒత్తిడిని తగ్గించి, శరీరానికి, మనసుకు చైతన్యాన్ని కలిగిస్తుంది. అందుకే మొదటి రాత్రి గదిని మల్లెపూలతో అలంకరిస్తారు. అలాగే, మల్లెపూలు పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. వివాహం వంటి శుభకార్యాలలో వీటి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.
సాంప్రదాయం ప్రకారం కూడా మల్లెపూలు సౌందర్యాన్ని, ఆనందాన్ని సూచిస్తాయని నమ్మకం ఉంది. కొత్త జంట జీవితంలో సౌఖ్యం, శాంతి నెలకొనాలని కోరుతూ పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారు. అందుకే ఫస్ట్ నైట్ రోజున మల్లెపూలతో గదిని అలంకరించడం ఒక అందమైన సంప్రదాయంగా మారింది.
Also Read: Tirumala: బ్యాడ్ న్యూస్.. తిరుమలకు వెళ్లే ఏపీ వాసులకు ఫ్రీ బస్సు వర్తించదు
First Night: ఫస్ట్ నైట్ రోజున మల్లెపూలే ఎందుకు..?
