Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు అస్సలు కొనొద్దు..!

what not to buy on akshaya tritiya

what not to buy on akshaya tritiya

Akshaya Tritiya 2026: వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ పండుగను ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తారు. 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30, బుధవారం వచ్చింది. ఈ రోజున బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ఈ రోజు షాపింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

అయితే, ఈ రోజున కొన్ని వస్తువులు కొనకూడదని కూడా పండితులు సూచిస్తున్నారు. వాటిని కొనడం అశుభంగా భావిస్తారు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

అక్షయ తృతీయ రోజున కత్తి, కత్తెర, సూది, గొడ్డలి, కొడవలి, బ్లేడ్ వంటి పదునైన వస్తువులను కొనడం మంచిది కాదని చెబుతారు. ఇవి ఇంట్లో గొడవలు, విభేదాలకు కారణమవుతాయని నమ్మకం ఉంది.

అలాగే ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం, నల్లటి వస్తువులు కొనడం కూడా నివారించాలి. నలుపు రంగు ఫర్నిచర్, ఇనుప వస్తువులు కొనడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని విశ్వసిస్తారు.

ఇక స్టీల్, అల్యూమినియం పాత్రలు కూడా ఈ రోజున కొనకూడదని సూచిస్తున్నారు. అలాగే ముళ్లు ఉన్న మొక్కలు, ముళ్ల పూలను ఇంటికి తీసుకురావడం కూడా శుభకరం కాదని అంటారు.

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనలేని పరిస్థితి ఉంటే కూడా, ఇనుప లేదా పదునైన వస్తువులు కొనకుండా ఉండటం మంచిదని పెద్దలు చెబుతున్నారు. అనవసరంగా సమస్యలను ఆహ్వానించకుండా జాగ్రత్తపడాలి.

గమనిక: పై సమాచారం మత విశ్వాసాలు మరియు పండితుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. పాఠకులు తమ విశ్వాసాలను అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలి.

Also Read: Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు..!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు అస్సలు కొనొద్దు..!