Monsoon Care: ఇంట్లో చిన్న పిల్లలున్నారా? వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

monsoon care tips for kids

Monsoon Care: వర్షాకాలం వచ్చేసింది. చాలా చోట్ల ఈదురుగాలులు, భారీ వర్షాలు ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. నిజానికి వర్షాకాలం పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వానలో తడవడం, కాగితపు పడవలు చేసి ఆ నీళ్లలో వదలడం ఎంతో సరదాగా ఉంటుంది. ఇదే సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులు వస్తాయి. ఈ కారణంగా వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉండటం వల్ల వారు జలుబు, దగ్గు, జ్వరం, డెంగ్యూ, మలేరియా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు(Monsoon Care) తీసుకోవడం తప్పనిసరి.

Essential Monsoon Health Tips for Kids | Fun Activities Included

1. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారం (Safe Drinking Water & Food)

  • కాచి చల్లార్చిన నీరు: ఈ సీజన్‌లో నీటి ద్వారా వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలకు ఎల్లప్పుడూ బాగా కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి.

  • తాజా ఆహారం: పిల్లలకు నిల్వ ఉంచిన లేదా బయటి ఆహారాలు ఇవ్వకూడదు. వేడిగా, తాజాగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే అందించాలి.

2. దోమల నుండి రక్షణ (Protection Against Mosquitoes)

వర్షాకాలంలో నిలిచిపోయే నీటి వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి.

  • పిల్లలకు ఒళ్ళంతా కప్పేలా పొడవాటి చేతులున్న కాటన్ దుస్తులను వేయాలి.

  • సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసివేయాలి.

  • పిల్లల చర్మానికి సురక్షితమైన మాస్కిటో రిపెల్లెంట్ క్రీములు లేదా ప్యాచెస్ ఉపయోగించాలి.

6 Ways To Keep Your Kids From Falling Sick During Monsoon - GOQii

3. వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene)

  • చేతుల శుభ్రత: బయట ఆడుకుని వచ్చిన తర్వాత లేదా తిండి తినే ముందు పిల్లల చేతులను సబ్బుతో శుభ్రంగా కడిగించాలి.

  • గోళ్ళు కత్తిరించడం: పిల్లల గోళ్ళలో మురికి చేరి, అది ఆహారం ద్వారా కడుపులోకి వెళ్ళి నులిపురుగుల సమస్యలు రావచ్చు. కాబట్టి గోళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.

4. పొడి వాతావరణం, సరైన దుస్తులు (Keep Them Dry)

పిల్లలు వర్షంలో తడిస్తే వెంటనే తల, శరీరం తుడిచి, పొడి దుస్తులు వేయాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వారికి కొద్దిగా వెచ్చగా ఉండే దుస్తులను తొడగడం మంచిది. తేమగా ఉన్న బట్టలు వేయడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

5. ఇంటి పరిసరాల శుభ్రత (Clean Environment)

ఇంటి లోపల, పరిసరాల్లోనూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లు తేమ లేకుండా, శుభ్రంగా ఉండేలా క్రమం తప్పకుండా తుడవాలి.

చిన్న పిల్లల విషయంలో కొద్దిపాటి శ్రద్ధ, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి వారిని సులభంగా కాపాడుకోవచ్చు. ఏదైనా స్వల్ప అనారోగ్య లక్షణాలు (జ్వరం, వాంతులు, విరేచనాలు) కనిపిస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే శిశు వైద్యుడిని (Pediatrician) సంప్రదించడం శ్రేయస్కరం.

Also Read: Breakfast Routine: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్ తిన్నారా.. డైరెక్ట్ ఐసీయూకే