Healthy Tips: చాలా డేంజర్.. మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా..?

Is it safe to hold pee? 5 possible complications

Is it safe to hold pee? 5 possible complications

Healthy Tips: చాలా మంది చిన్న విషయం అనుకుని మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటూ ఉంటారు. వాష్‌రూమ్‌కు వెళ్లడానికి బద్ధకించడం, “ఇంకొంచెం తర్వాత వెళ్దాం” అని వాయిదా వేయడం సాధారణంగా కనిపించే అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇలా తరచూ మూత్రం ఆపుకోవడం వల్ల కిడ్నీలతో పాటు గుండె, మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు, సంతాన సమస్యలకు కూడా దారితీయవచ్చు.

మూత్ర విసర్జన అనేది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. శరీరంలో ఉన్న వ్యర్థాలు, విషపదార్థాలు యూరిన్ రూపంలో బయటకు వెళ్తాయి. అందుకే సమయానికి నీళ్లు తాగడం, అవసరమైనప్పుడు మూత్రం విడవడం చాలా ముఖ్యం. కానీ కొంత మంది తరచూ వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడానికే తగ్గిస్తారు. ఇంకొందరు పని మధ్యలో ఉన్నామనే కారణంతో మూత్రాన్ని ఆపుకుంటారు. ఈ అలవాటు కొనసాగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఎక్కువ సేపు యూరిన్ ఆపుకోవడం వల్ల ముందుగా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. యూరిన్‌లో ప్రధానంగా నీరు, యూరియా, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి పదార్థాలు ఉంటాయి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే, అందులోని కొన్ని పదార్థాలు క్రిస్టల్స్‌గా మారి కిడ్నీలో చేరే అవకాశం ఉంది. ఇవే తరువాత కిడ్నీ రాళ్లకు కారణమవుతాయి. అలాగే కిడ్నీల ఫిల్టరేషన్ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.

హెల్త్ నిపుణుల ప్రకారం, ఈ అలవాటు గుండె, మెదడు పనితీరుపై కూడా పరోక్ష ప్రభావం చూపవచ్చు. బ్లాడర్ నిండినప్పుడు మెదడు సంకేతాలు పంపుతుంది. అయితే ఈ సంకేతాలను పదే పదే పట్టించుకోకపోతే, శరీరం ఇచ్చే సహజ సూచనలు క్రమంగా తగ్గిపోతాయి. దీని వల్ల న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ఎక్కువసేపు మూత్రం ఆపుకోవడం వల్ల పెల్విక్ మసిల్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్లాడర్‌లో యూరిన్ ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఉంది. మూత్రం పోయేటప్పుడు మంట, రంగులో మార్పు వంటి సమస్యలు కనిపించవచ్చు.

చూడటానికి చిన్న అలవాటులా అనిపించినా, మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు బ్లాడర్‌ను ఖాళీ చేసుకోవడం, తగినంత నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.

గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.

Also Read: Energy Lockdown: ట్రెండ్ అవుతున్న ఎనర్జీ లాక్‌డౌన్.. దీనర్థం ఏంటంటే..

Healthy Tips: చాలా డేంజర్.. మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా..?