Mobile: పొరపాటున కూడా మొబైల్‌లో ఈ పనులు చేయకండి

Do Not Do These 10 Things on Your Phone

Do Not Do These 10 Things on Your Phone

Mobile: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారింది. మారుతున్న టెక్నాలజీతో పాటు, చాలా పనులు ఇప్పుడు మొబైల్ ద్వారానే పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. బ్యాంకింగ్ పనులు, వివిధ రకాల దరఖాస్తులు, సమాచారాన్ని తెలుసుకోవడం వంటి ఎన్నో పనులు కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ ద్వారా చేయగలుగుతున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు చాలామంది స్మార్ట్‌ఫోన్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

మొబైల్ ఫోన్ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఫోన్‌ను మంచి పనులకే కాకుండా, చెడు కార్యకలాపాలకు కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఏ విషయమైనా సెర్చ్ చేస్తే క్షణాల్లో సమాచారం లభించే అవకాశం ఉంది. కానీ చట్టవిరుద్ధమైన విషయాలను వెతకడం లేదా వాటిలో పాల్గొనడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.

అందుకే మొబైల్ వినియోగదారులుగా చట్ట పరిమితులను తెలుసుకుని, మనం ఫోన్ ద్వారా ఏమి చేయాలి, ఏమి చేయకూడదో గుర్తుంచుకోవడం చాలా అవసరం. సాంకేతికత అభివృద్ధితో పాటు హ్యాకింగ్, బ్యాంకు మోసాలు, అశ్లీల కంటెంట్ వ్యాప్తి వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కొంతమంది తమ ఫోన్ ద్వారా చేసే తప్పుడు పనులు ఎవరికీ తెలియవని భావిస్తారు. కానీ వాస్తవానికి అలాంటి కార్యకలాపాలను సైబర్ భద్రతా సంస్థలు గుర్తించే అవకాశం ఉంది. చట్టవిరుద్ధమైన పనులు చేస్తే జైలుశిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుంది.

మొబైల్‌లో తప్పక నివారించాల్సిన కొన్ని పనులు ఇవి:

చైల్డ్ పోర్నోగ్రఫీ:

పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను చూడటం, సేవ్ చేయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరం. పోక్సో చట్టం ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. ఇటువంటి కేసుల్లో 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

బాంబులు తయారు చేసే విధానం వెతకడం:

గూగుల్‌లో సరదాగా అయినా బాంబులు తయారు చేసే మార్గాలు వంటి విషయాలను సెర్చ్ చేయడం ప్రమాదకరం. ఇలాంటి సెర్చ్‌లను గూగుల్ మరియు భద్రతా సంస్థలు గమనించే అవకాశం ఉంది. అవసరమైతే ఆ సమాచారం భద్రతా ఏజెన్సీలతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది.

సినిమా పైరసీ:

పైరసీ సినిమాలను డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలా చేస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.

ఇతరుల ఫోటోలు లేదా వీడియోలను అనుమతి లేకుండా షేర్ చేయడం:

ఎవరైనా వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో లేదా ఇతరులకు పంపడం గోప్యత ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇది కూడా చట్టపరంగా నేరమే. ఈ కారణంగా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

అందువల్ల స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. సాంకేతికతను మంచి పనుల కోసం ఉపయోగిస్తే అది మనకు ఉపయోగపడుతుంది. కానీ చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగిస్తే తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

Also Read: Court: అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

Mobile: పొరపాటున కూడా మొబైల్‌లో ఈ పనులు చేయకండి