AC, Induction Cooktop: వేసవికాలం ప్రారంభమయ్యాక ఉక్కపోతలు పెరగడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం ఎక్కువైంది. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటంతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో ఒకేసారి ఎక్కువ ఎలక్ట్రిక్ పరికరాలు వాడటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఫలితంగా కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా, కనెక్షన్ లోడ్‌ను మించితే జరిమానాలు, నోటీసులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఇంట్లో ఏసీ, ఇండక్షన్ స్టవ్, ఫ్రిజ్, ఫ్యాన్, వాషింగ్ మెషీన్ వంటి పరికరాలను ఒకేసారి వాడితే లోడ్ గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా ఒక ఇండక్షన్ స్టవ్ సుమారు 2 కిలోవాట్లు వినియోగిస్తే, ఒక ఏసీ 1.2 నుంచి 1.5 కిలోవాట్లు ఉపయోగిస్తుంది. ఇంట్లో రెండు ఏసీలు ఉంటే ఈ లోడ్ ఇంకా పెరుగుతుంది. మొత్తం కలిపి 5–6 కిలోవాట్లకు పైగా లోడ్ వెళ్లే అవకాశం ఉంది. ఇది సాధారణ గృహ కనెక్షన్‌కు మించి ఉండటం వల్ల ఫ్యూజ్ పోవడం, పవర్ ట్రిప్ కావడం, వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యలను నివారించాలంటే అన్ని పరికరాలను ఒకేసారి వాడకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీ, ఇండక్షన్ స్టవ్, వాషింగ్ మెషీన్‌లను వేర్వేరు సమయాల్లో ఉపయోగించడం మంచిది. అవసరమైతే విద్యుత్ శాఖను సంప్రదించి లోడ్ పెంచించుకోవచ్చు.
సాధారణంగా రాత్రివేళ ఏసీ వాడుతూ, ఉదయం ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తే లోడ్ సమస్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ రెండింటిని కలిపి వాడాల్సి వస్తే, వంట సమయంలో ఏసీ ఆఫ్ చేయడం మంచిది. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లును నియంత్రించడమే కాకుండా ప్రమాదాలను కూడా నివారించవచ్చు.
Also Read: Tech News: మీ ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్ పాటించండి!
AC, Induction Cooktop: ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?
