April Fools Day: ‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

April Fool's Day 2026: History, significance and why we love playing pranks

April Fool's Day 2026: History, significance and why we love playing pranks

April Fools Day: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ను సరదాగా జరుపుకుంటారు. ఈ రోజున చిన్న చిన్న ప్రాంక్స్, జోక్స్ చేసి స్నేహితులు, బంధువులను ఆటపట్టించడం ఆనవాయితీగా మారింది. 2026లో కూడా ఏప్రిల్ 1 బుధవారం ఈ ఫూల్స్ డేను జరుపుకుంటున్నారు.

ఏప్రిల్ 1న ఫూల్స్ డే జరుపుకునే సంప్రదాయం ఎలా మొదలైంది అనే విషయంపై పలు కథలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకునేది క్యాలెండర్ మార్పుకు సంబంధించినది. 16వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్ ప్రకారం జనవరి 1నే కొత్త సంవత్సర ప్రారంభంగా నిర్ణయించారు. అంతకు ముందు జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు.

క్యాలెండర్ మారిన తర్వాత కూడా కొంతమంది పాత పద్ధతినే అనుసరిస్తూ ఏప్రిల్ 1న న్యూ ఇయర్ జరుపుకుంటుండేవారు. అలా చేసేవారిని ఇతరులు సరదాగా ‘ఫూల్స్’ అంటూ ఆటపట్టించేవారట. ఈ విధంగా ఏప్రిల్ 1న ఆటపట్టించే సంప్రదాయం క్రమంగా ‘ఏప్రిల్ ఫూల్స్ డే’గా మారింది.

ఇంకా ఒక అభిప్రాయం ప్రకారం, 1582లో కొత్త క్యాలెండర్ అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. అయినా కూడా ఎవరైనా ఏప్రిల్ 1న న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబితే, వారిని వెర్రివాళ్లుగా భావించి ‘ఏప్రిల్ ఫూల్’ అని పిలిచేవారని చెబుతారు.

ఈ రోజు ప్రధాన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టకుండా సరదాగా నవ్వులు పంచుకోవడం. చిన్న చిన్న జోక్స్ చేసి, “నీ వెనకాల ఏదో ఉంది”, “నీ చొక్కా చినిగింది” అంటూ ఆటపట్టించి చివరికి “ఏప్రిల్ ఫూల్” అని నవ్వుకోవడం సాధారణంగా కనిపించే విషయం.

మొదట బ్రిటన్‌లో ఈ రోజును ఫూల్స్ డేగా జరుపుకోవడం ప్రారంభమై, తరువాత ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ఇప్పుడు ప్రపంచమంతటా ఈ రోజును ఫన్నీ ప్రాంక్స్, జోక్స్‌తో ఆనందంగా జరుపుకుంటున్నారు.

మొత్తానికి, ఏప్రిల్ ఫూల్స్ డే అనేది హాస్యాన్ని పంచుకోవడం, మనుషుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం జరుపుకునే ప్రత్యేకమైన రోజు.

Also Read: Ration Card: ఒకేసారి 3 నెలల బియ్యం.. ఈ నెలలోనే

April Fools Day: ‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?