Air Coolers: ఎయిర్‌ కూలర్‌ కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Air Cooler Buying Guide: How to Select Air Cooler?

Air Cooler Buying Guide: How to Select Air Cooler?

Air Coolers: వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్యాన్ గాలి చాలాసార్లు వేడిగా అనిపించడంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్లను ఉపయోగించడం చూస్తుంటాం. అయితే కూలర్ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా మీ గది పరిమాణాన్ని బట్టి కూలర్‌ను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా 200 నుంచి 300 చదరపు అడుగుల వరకు ఉన్న గదులకు పర్సనల్ కూలర్ సరిపోతుంది. గది పరిమాణం అంతకంటే పెద్దదైతే డెజర్ట్ కూలర్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వాటర్ ట్యాంక్ సామర్థ్యం:
కూలర్ కొనుగోలు చేసే ముందు వాటర్ ట్యాంక్ కెపాసిటీని తప్పనిసరిగా గమనించాలి. చిన్న గదుల కోసం 15 నుంచి 25 లీటర్ల ట్యాంక్ ఉన్న కూలర్ సరిపోతుంది. కొంచెం పెద్ద గదుల కోసం 25 నుంచి 40 లీటర్ల సామర్థ్యం ఉన్న కూలర్ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద గదులైతే 40 లీటర్లకు పైగా కెపాసిటీ ఉన్న కూలర్ ఎంపిక చేయడం మంచిది.

వాతావరణాన్ని బట్టి ఎంపిక:
మీరు నివసించే ప్రాంతం వాతావరణాన్ని బట్టి కూడా కూలర్ ఎంపిక చేయాలి. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో డెజర్ట్ కూలర్లు మంచి కూలింగ్ ఇస్తాయి. అయితే తీర ప్రాంతాల్లో ఎక్కువ తేమ ఉండటంతో అక్కడ పర్సనల్ లేదా టవర్ కూలర్లు తీసుకోవడం ఉత్తమం.

నాయిస్ లెవెల్:
కూలర్ ఆన్ చేసినప్పుడు వచ్చే శబ్దం కూడా చాలా ముఖ్యం. కొన్ని కూలర్లు ఎక్కువ సౌండ్ చేస్తుంటాయి. మరికొన్ని చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. కాబట్టి షోరూమ్‌లో కూలర్ కొనుగోలు చేసే ముందు దాన్ని ఆన్ చేసి నాయిస్ లెవెల్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం మంచిది.

ఆటో ఫిల్ సిస్టమ్:
కొన్ని కూలర్లలో ఆటో ఫిల్ సౌకర్యం ఉంటుంది. ట్యాంక్‌లో నీళ్లు తగ్గిపోతే అవి ఆటోమేటిక్‌గా నింపబడతాయి. ఈ ఫీచర్ ఉన్న కూలర్లు ఉపయోగిస్తే మోటార్ చెడిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.

కూలింగ్ ప్యాడ్స్:
ఎయిర్ కూలర్ పనితీరులో కూలింగ్ ప్యాడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మార్కెట్లో వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ ప్యాడ్స్ వంటి రకాలుంటాయి. వీటిలో హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్ ఇస్తాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.

అదనపు ఫీచర్లు:
ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కూలర్లలో కూడా అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రిమోట్ కంట్రోల్, యాంటీ మస్కిటో ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ వంటి సౌకర్యాలతో కంపెనీలు కూలర్లను తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటి గురించి కూడా తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.

ఐస్ ఛాంబర్ సౌకర్యం:
కొన్ని కూలర్లలో ఐస్ ఛాంబర్ ఉంటుంది. అందులో ఐస్ క్యూబ్స్ వేసినట్లయితే నీరు త్వరగా చల్లబడుతుంది. దీంతో కూలర్ నుంచి వచ్చే గాలి మరింత చల్లగా ఉంటుంది.

పవర్ వినియోగం:
కూలర్ ఎంత కరెంట్ వినియోగిస్తుందో కూడా తెలుసుకోవాలి. స్టార్ రేటింగ్ చూసి ఎంపిక చేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అదేవిధంగా ఇటీవల ఇన్వర్టర్ టెక్నాలజీతో కూడిన కూలర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ కరెంట్ ఉపయోగించడమే కాకుండా, కరెంట్ పోయినప్పటికీ కొంతసేపు పనిచేస్తాయి.

కాబట్టి కూలర్ కొనుగోలు చేసే ముందు ఈ విషయాలను గమనిస్తే, మీ అవసరాలకు సరిపోయే మంచి కూలర్‌ను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: War Effect: రేపటి నుంచి ఆ సిలిండర్‌ సరఫరా నిలిపివేత

Air Coolers: ఎయిర్‌ కూలర్‌ కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి