Thalapaty Vijay: ఇటీవలి కాలంలో తెలుగునాట సినీ నటుల పెళ్లిళ్లతో టాలీవుడ్ సందడి చేస్తుంటే, మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో మాత్రం విడాకుల వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. దాదాపు ప్రతి ఏడాది కొందరు స్టార్ హీరోలు తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో జీ.వి. ప్రకాశ్ కుమార్, ధనుష్, రవి మోహన్ వంటి ప్రముఖులు తమ భార్యలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో తలపతి విజయ్ పేరు కూడా వినిపిస్తోంది.
ఇటీవల విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని, దానికి సంబంధించి విజయ్ దాదాపు రూ.250 కోట్ల వరకు భరణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు ప్రచారం అయ్యాయి. ఇదే సమయంలో విజయ్ సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం ఆయనకు మరో సమస్యగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు, ట్రోలింగ్‌లు వస్తుండటంతో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.
ఇంకా ఒకవైపు నటి త్రిషతో విజయ్‌కు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే కారులో అక్కడికి రావడం సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే త్రిష–విజయ్ సంబంధాలపై వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, వీరిద్దరూ కలిసి కార్యక్రమానికి రావడం మరోసారి చర్చకు దారితీసింది. ఈ వీడియోలే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలపై వస్తున్న వార్తలకు నిదర్శనం అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
