OTT Movie: రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి

'Sabdham' OTT release date: Aadhi’s horror thriller makes digital debut after a year

'Sabdham' OTT release date: Aadhi’s horror thriller makes digital debut after a year

OTT Movie: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని పెద్ద హిట్ సినిమాలు ఐదు లేదా ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం రెండు నెలల తర్వాత మాత్రమే ఓటీటీలో కనిపిస్తాయి. కానీ ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.

గత ఏడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా భయపెట్టింది. ముఖ్యంగా ఇందులో వినిపించే వింత శబ్దాలు, బీజీఎమ్ ప్రేక్షకుల్లో టెన్షన్ క్రియేట్ చేశాయి. అంతేకాదు, ఇప్పటివరకు ఎక్కువగా చూడని కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమా కథ మున్నార్‌లోని ఒక మెడికల్ కాలేజీ చుట్టూ తిరుగుతుంది. అక్కడ వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మృతదేహాలపై విచిత్రమైన గుర్తులు కనిపించడంతో కాలేజీలో ఏదో అనుమానాస్పద విషయం ఉందని అందరూ భావిస్తారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు రూబాన్ అనే ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్‌ను పిలుస్తారు. అతను సైంటిఫిక్ పద్ధతులతో ఆత్మల ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో విద్యార్థుల మరణాల వెనక ఒక వింత శబ్దం కారణమని గ్రహిస్తాడు.

ఇంకా కాలేజీ గత చరిత్రను పరిశీలిస్తే, 20 ఏళ్ల క్రితం అక్కడ పనిచేసిన ఒక మ్యూజిక్ టీచర్ అనుమానాస్పదంగా మరణించిన విషయం బయటపడుతుంది. ఆమె మరణానికి కాలేజీ సిబ్బంది సంబంధం ఉన్నట్టు రూబాన్ తెలుసుకుంటాడు. ఆ తరువాత ఏమైంది? ఆ ఆత్మను ఎలా ఎదుర్కొన్నాడు? విద్యార్థుల మరణాలను ఎలా ఆపాడు? అనే అంశాలు సినిమాలో ఉత్కంఠగా చూపించారు.

‘శబ్దం’ అనే ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ టైటిల్‌కు తగ్గట్టుగానే సౌండ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటించగా, సిమ్రాన్, లైలా కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే రెడిన్ కింగ్స్‌లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనన్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు నటించారు.

ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికి తమిళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: Ram Charan: ‘పెద్ది’ షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం

OTT Movie: రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి