Naga Chaitanya: ‘వృషకర్మ’ ఈవెంట్ లో కిందపడ్డ నాగ చైత‌న్య

Naga Chaitanya Falls Badly From Chair At Vrushakarma Glimpse Launch – Watch Video

Naga Chaitanya Falls Badly From Chair At Vrushakarma Glimpse Launch – Watch Video

Naga Chaitanya: టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘వృషకర్మ’ గ్లింప్స్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నాగ చైతన్య కూడా పాల్గొన్నారు. మొదటగా స్టేజ్‌పై ఉన్నవారు తమ ప్రసంగాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అదే సమయంలో అనుకోకుండా నాగ చైతన్య కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా వెనక్కి జారిపడింది. దీంతో ఆయన కూడా వెనక్కి పడిపోయారు.

ఈ ఘటనతో అక్కడ ఉన్న అభిమానులు, చిత్రబృందం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మెరుపువేగంతో స్పందించి నాగ చైతన్యను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ సంఘటన చూసిన అభిమానులు ఆయనకు ఏమైనా గాయాలయ్యాయేమోనని ఆందోళన చెందారు. కానీ నాగ చైతన్య మాత్రం వెంటనే లేచి తనకు ఏమీ కాలేదని చిరునవ్వుతో అభిమానులకు సైగ చేసి వారిని ధైర్యం చెప్పారు.

అంతేకాకుండా పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ‘వృషకర్మ’ సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురైనప్పటికీ, చివరికి నాగ చైతన్య సేఫ్‌గా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Viral: రికార్డ్ బ్రేకింగ్ స్మైల్.. అవును ఇతనికి 42 పళ్లు మరి..!

Naga Chaitanya: ‘వృషకర్మ’ ఈవెంట్ లో కిందపడ్డ నాగ చైత‌న్య