Rupee: ఫర్ ది ఫస్ట్ టైం.. 96 మార్కును దాటి కనిష్ట స్థాయికి..

Rupee tumbles to record low of 96.96 vs USD as US-Iran stalemate stokes global inflation fears

Rupee tumbles to record low of 96.96 vs USD as US-Iran stalemate stokes global inflation fears

Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి తొలిసారిగా 96 మార్కును దాటి, డాలర్‌కు రూ.96.89 స్థాయికి చేరుకుంది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి విలువ 96.53 వద్ద ఉండగా, బుధవారం ఉదయం అది 96.86 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి దాదాపు ఒక రూపాయి వరకు క్షీణించడం గమనార్హం.

రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల కారణంగా చమురు ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

భారతదేశం తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి మరింత అధికమవుతోంది.

ఇటీవల కూడా చమురు ధరలు భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏప్రిల్ 30న బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 126 డాలర్ల వరకు చేరగా, మార్చి 9న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఒక్కసారిగా 27 శాతం పెరిగి 119 డాలర్ల స్థాయిని తాకింది.

ఇక ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధిపై నెలకొన్న ఆందోళనలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ సముద్ర మార్గం ద్వారా జరుగుతుంది. అక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందనే భయంతో చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా అమెరికా బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల వల్ల డాలర్ బలపడుతూ, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

Also Read: Silver Chappals: కిలోన్నర వెండితో అల్లుడికి చెప్పులు చేయించిన మామ

Rupee: ఫర్ ది ఫస్ట్ టైం.. 96 మార్కును దాటి కనిష్ట స్థాయికి..