Chatgpt: చాట్ జీపీటీకి 25 లక్షల మంది గుడ్ బై

Over 2.5 Million Users Boycott ChatGPT. Here's Why

Over 2.5 Million Users Boycott ChatGPT. Here's Why

Chatgpt: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీకి ఇటీవల ఊహించని పరిణామం ఎదురైంది. పెంటగాన్‌తో ఓపెన్ ఏఐ సంస్థ ఒప్పందం చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేసినట్లు సమాచారం. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఉన్న చాట్ జీపీటీ యాప్‌ను కూడా తొలగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

ఈ వివాదానికి కారణం ఓపెన్ ఏఐ మరియు అమెరికా రక్షణ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా రక్షణ శాఖలో ఓపెన్ ఏఐ రూపొందించిన ఏఐ మోడళ్లను ఉపయోగించనున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం అమెరికాలో చాట్ జీపీటీ యాప్ అన్ఇన్‌స్టాలేషన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

ఈ పరిస్థితిపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఈ సమస్య చాలా క్లిష్టమైనదని, దీనిపై స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరమని తెలిపారు. పరిస్థితులను సరిచేయడానికి సంస్థ నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పెంటగాన్‌తో కుదిరిన ఒప్పందంలో కొన్ని మార్పులు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఈ వ్యవహారానికి మరో నేపథ్యం కూడా ఉంది. అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన క్లాడ్ ఏఐ మోడళ్లను ఉపయోగించేది. అయితే ఆ మోడళ్లను ఎలాంటి పరిమితులు లేకుండా మిలటరీ వినియోగానికి ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. దీనికి ఆంథ్రోపిక్ సంస్థ అంగీకరించలేదు. గడువు ముగియడంతో ఓపెన్ ఏఐ ముందుకు వచ్చి అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీకి సుమారు 900 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ వివాదం కారణంగా కొంతమంది యూజర్లు యాప్‌ను వదిలిపెడుతున్నారని, దీంతో వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Tragedy: కళ్యాణోత్సవంలో అపశ్రుతి.. అగ్నిగుండంలో పడ్డ భక్తులు

Chatgpt: చాట్ జీపీటీకి 25 లక్షల మంది గుడ్ బై