Gold Rates: ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గు చూపారు. అయితే సోమవారం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. బంగారం ధరలు భారీగా పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. ధరలు తగ్గడంతో చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
సోమవారం బంగారం ధరలు రూ.3,290 వరకు తగ్గాయి. ఈ తగ్గుదల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,69,800కి చేరింది. ఆదివారం ఇది రూ.1,73,090గా ఉంది. అంటే ఒక్కరోజులోనే గణనీయంగా పడిపోయింది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.1,55,650 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,58,650గా ఉండేది. దాదాపు రూ.3 వేల వరకు తగ్గుదల నమోదైంది.
విజయవాడ, విశాఖపట్నం
విజయవాడ, విశాఖపట్నంలో కూడా హైదరాబాద్ ధరలే అమలులో ఉన్నాయి. అంటే 24 క్యారెట్ల బంగారం రూ.1,69,800 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,55,650గా ఉంది.
చెన్నై
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,840గా ఉంది. ఆదివారం ఇది రూ.1,72,090గా ఉండేది. ఇక్కడ సుమారు రూ.1,250 వరకు తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,600గా కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,57,750 వద్ద ఉంది.
బెంగళూరు, ఢిల్లీ
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,69,800గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,55,650గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,69,950 కాగా, 22 క్యారెట్ల రేటు రూ.1,55,800గా కొనసాగుతోంది.
భవిష్యత్ అంచనాలు
అంతర్జాతీయంగా పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగితే స్టాక్ మార్కెట్లు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మళ్లవచ్చు. దీంతో పసిడి ధరలు భవిష్యత్‌లో మళ్లీ పెరిగి రూ.2 లక్షల మార్క్‌ను చేరుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
